ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: అమెరికాలో శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు

ABN, Publish Date - May 26 , 2024 | 03:36 PM

1998లో ఏర్పాటు అయిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం నాడు ఆదిదేవునికి పలు సేవలు, పూజలు, హోమాలు, క్రతువులు ఘనంగా నిర్వహించారు.

St.Louis Hindu Temple Brahmotsvam

ఎన్నారై డెస్క్: 1998లో ఏర్పాటు అయిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం నాడు ఆదిదేవునికి పలు సేవలు, పూజలు, హోమాలు, క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారిని శేషవాహనంపై ఊరేగించారు. శనివారం నాటి కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు (NRI) పాల్గొన్నారు.

NRI: సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఉదయం సుప్రభాత, తోమాల సేవల అనంతరం అభిషేక కార్యక్రమాన్ని వేలమంది ప్రవాసుల నడుమ వైభవోపేతంగా జరిపారు. అనంతరం తిరుచ్చి ఉత్సవం పేరిట ఉత్సవమూర్తులను ఆలయానికి ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిక్రమ మార్గంలో (మాఢ వీధులు) ఊరేగించి గరుడ పతక ప్రతిష్ఠ చేశారు. భేరి పూజ, నవసంధి పూజలతో పాటు అగ్నిమథనాన్ని నిర్వహించారు. చెక్కలో ఉన్న నిప్పు రాజేస్తే వెలిగినట్లు సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకోవాలంటే భక్తి ద్వారా సాధ్యమని అర్చకులు క్రతువులను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన గరుడ హోమంలో ప్రవాసులు భక్తిగా పాల్గొన్నారు.


సాయంకాలం కార్యక్రమాల్లో అగ్నిప్రతిష్ఠ, వుక్తహోమం తర్వాత శేషవాహనంపై శ్రీవారిని ఘనంగా ఊరేగించారు. భక్తులకు ఉచితంగా సాంప్రదాయ భోజనాన్ని ఆలయ నిర్వాహకులు అందజేశారు. తంజావూరు నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చిన వాహనాలపై స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ అన్నారు. ఈ 5 రోజుల వేడుకల్లో 30 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు.

సెయింట్ లూయిస్ స్థానిక ప్రవాసుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో స్థానికులు స్వామివారి ఊరేగింపుకు అవసరమైన ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి మురళీ పుట్టగుంట తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నాడు పూష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని మీడియా కమిటీ ఛైర్మన్ రాజా సూరపనేని తెలిపారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - May 26 , 2024 | 03:39 PM

Advertising
Advertising