NRI: పుష్పయాగంతో ముగిసిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ తొలి బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - May 30 , 2024 | 03:25 PM
అమెరికాలోని మిస్సోరిలో గల సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ తొలి బ్రహ్మోత్సవ వేడుకలు మంగళవారం నాడు పుష్పయాగంతో వైభవంగా ముగిశాయి.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని మిస్సోరిలో గల సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ తొలి బ్రహ్మోత్సవ వేడుకలు మంగళవారం నాడు పుష్పయాగంతో వైభవంగా ముగిశాయి. ఆఖరి రోజు కావడంతో స్థానిక ప్రవాసులు (NRI) పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం కార్యక్రమాల్లో భాగంగా చక్రస్నానం, చూర్ణోత్సవం, ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీ, మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా ఏర్పాట్లను సమన్వయపరిచారు.
Read Latest NRI News and Telugu News
Updated Date - May 30 , 2024 | 03:35 PM