NRI: లడ్డూ కల్తీ.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం
ABN, Publish Date - Oct 08 , 2024 | 01:54 PM
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు.
ఎన్నారై డెస్క్: తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాపపరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేద ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల టీడీపీ ఎన్నారై అధ్యక్షులు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు (NRI).
NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!
శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై బీజేపీ నేతలు పలువురు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
Updated Date - Oct 08 , 2024 | 01:59 PM