-
NRI: సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
ABN, Publish Date - Mar 10 , 2024 | 03:35 PM
సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
ఎన్నారై డెస్క్: మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలను కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి, ధర్మ నిరతి, ధర్మ అనుష్ఠానం కోసం 2014 నుంచి అనేక కార్యక్రమాలు అయిన నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకాలను ఘనంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఈ సంవత్సరం దశమ వార్షికోత్సవం జరుపుకోరుతున్న శుభసందర్భంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం 2024 మార్చి 8న రాత్రి 11 గంటలు నుండి శనివారం ఉదయం 6 గంటలు వరుకు శ్రీ అరసకేసరి శివాన్ మందిరం ప్రాంగణంలో పంచారామ ప్రతీకగా లింగోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు.
Dubai: దుబాయ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ టైం 5 రోజులే..!
భారతదేశం నుండి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో పంచ లింగములను పార్థివ లింగములుగా సమంత్రకముగా చేశారు. ఈ పంచరుద్రులను మనము పృథివి ఆపః తేజో వాయుర్ ఆకాశములు పంచభూతాత్మక పంచారామ క్షేత్రాధిష్ఠిత మహా లింగేశ్వరులనే భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషమైన ప్రక్రియ అని నిర్వాహకులు తెలియజేసారు. ఈ సందర్భంగా పంచ రుద్రులుకు ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటలు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమం సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణలు పెద్దఎత్తున 100కు మంది పైగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతో అందరిని మంత్రముగ్ధులను చేశారు.
కార్యక్రమం తదనంతరం తీర్ధప్రసాదాలను అతిథులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం అద్భుతమైన భక్తి కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. కార్యక్రమంలో భాగమైనందుకు తాము చాలా అనీర్వచనీయమైన అనుభూతిని పొందామని వ్యాఖ్యానించారు. మొదటిసారి నిజమైన జాగరణ చేసామని అన్నారు. మహాశివరాత్రి రోజున, అభిషేకం చేసుకోవటం, అందునా పంచారామ లింగార్చనతో కూడుకొన్న జాగరణ అంతా శివమయం అయ్యిందని చెప్పటం అతిశయోక్తి కాదని హర్షం వ్యక్తం చేసారు, కార్యక్రమం రూపకర్తలకు, కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసారు.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 10 , 2024 | 03:39 PM
Advertising
Advertising