TANA: తానా నిధులను రాబట్టేందుకు కట్టుబడి ఉన్నాం: చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:44 PM
తానా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించిన మాజీ ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ పూర్తిగా కట్టుబడి ఉందని బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి వెల్లడించారు.
ఎన్నారై డెస్క్: తానా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించిన మాజీ ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ పూర్తిగా కట్టుబడి ఉందని బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు (NRI).
NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు
తానాలో ఇంతకుముందు ఎప్పుడూ చోటు చేసుకోని ఈ ఘటనపై నవంబర్ 25న అత్యవసర బోర్డ్ సమావేశాన్ని నిర్వహించామని డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశానికి శ్రీకాంత్ పోలవరపు హాజరై తన తప్పిదాన్ని అంగీకరించారని, పూర్తి బాధ్యత తానే వహిస్తానని స్పష్టం చేశారని చెప్పారు. నిధుల మళ్లింపు చర్య తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, దీని గురించి మరెవ్వరికీ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారని చెప్పారు.
NRI news: జపాన్‌లో కార్తీక వన సమారాధన
ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకాంత్ తన ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామాను సమర్పించగా, తాము ఆమోదించామని పేర్కొన్నారు. ఇప్పటికే లక్ష డాలర్లు తిరిగి చెల్లించిన శ్రీకాంత్, మళ్లించిన మొత్తం 3.6 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
దారి మళ్లించిన నిధులను పూర్తిగా తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ ఎఫ్‌బీఐ సాయంతో చట్టబద్ధంగా, న్యాయపరంగా ముందుకు సాగుతోందని డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కఠిన మార్గదర్శకాలతో సాంకేతిక, పరిపాలనా చర్యలు అమలు చేస్తామని ఆయన తెలియజేశారు.
Updated Date - Nov 30 , 2024 | 04:50 PM