ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: తానా కళాశాల పరీక్షలు విజయవంతం

ABN, Publish Date - Sep 23 , 2024 | 06:50 PM

అమెరికా వ్యాప్తంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి కళాశాల పరీక్షలు శనివారం విజయవంతంగా జరిగాయి.

ఎన్నారై డెస్క్: అమెరికా వ్యాప్తంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి కళాశాల పరీక్షలు శనివారం విజయవంతంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తానా వారి ఈ కళాశాల కోర్సుల వార్షిక పరీక్షలకు వందలాదిమంది విద్యార్థులు టెక్సాస్, జార్జియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, మిచిగాన్, మసాచుసెట్స్, ఒమహా, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుండి హాజరయ్యారు (NRI). కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో కళాశాల వారు నిర్వహిస్తున్న ఈ కోర్సులకు అమెరికా వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి తానా వారు చేస్తున్న ఈ కృషికి విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు మిక్కిలి ఆనందం వెలిబుచ్చారు.

NRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు


వివిధ రాష్ట్రాలలో ఈ పరీక్షలు విజయవంతంగా జరగడంపై తానా కళాశాల చైర్ మాలతి నాగ భైరవ, తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మిక్కిలి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన మన సంప్రదాయ కళలను అమెరికాలో నేర్చుకుంటూ మన వారసత్వ సంపదను కాపాడుతున్న విద్యార్థినులను అభినందించారు. ఈ దిశగా తోడ్పాటుని అందిస్తున్న వారి తల్లిదండ్రులకు వీరు ఇరువురూ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ప్రోగ్రామ్ విజయవంతమయ్యేలా కృషి చేస్తూ విద్యార్థినులకు శాస్త్రీయ నృత్యం, కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ శిక్షణని అందిస్తున్న గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

NRI: భారతీయ పాఠశాల సమస్యలపై చర్చించిన గ్లోబల్ ఇండియన్!


తానా కళాశాల చైర్ మాలతి మాట్లాడుతూ ఈ సంవత్సరం కొత్తగా పరీక్షా విధానంలో తీసుకువచ్చిన మార్పులకు విద్యార్థినులు, తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మార్పునకు కారణమైన కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. వచ్చే వార్షిక సంవత్సరం నుండి వీణ, మృదంగం తదితర కోర్సులను కూడా చేర్చి ఈ కార్యక్రమం విస్తృతిని పెంచుతూ మరింత మంది గురువులను తానా కళాశాలకు సంఘటితం చేయాలని, మరెందరో విద్యార్థినులకు చేరువ చేయాలని సంకల్పిస్తున్నామని తెలియజేశారు.


తానా కళాశాల ముఖ్య సలహాదారులైన రాజేష్ అడుసుమిల్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కళాశాల కార్యవర్గం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల కోఆర్డినేటర్స్ వెంకట్ ఆవిర్నేని, రవీంద్ర చిట్టూరి, రమా ప్రత్తిపాటి, తానా ప్రతినిధులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి, వెంకీ అడబాల, రామకృష్ణ వాసిరెడ్డి, నాగ పంచుమర్తి, పరమేష్ దేవినేని, శ్రావణి సుధీర్, ఆయా నగరాల నుండి ఎంతో సహకారం అందించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ కళాశాల ప్రోగ్రాంకు చూపిస్తున్న ఆదరణకు ముగ్ధులైన తానా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు.

NRI: తానా మిడ్ - అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా లేడీస్ నైట్ ఈవెంట్‌

Read Latest and NRI News

Updated Date - Sep 23 , 2024 | 06:59 PM