ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!

ABN, Publish Date - Oct 08 , 2024 | 09:00 AM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బోస్టన్‌లోని గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో మాన్సీఫీల్డ్‌ టౌన్‌లో 5కే వాక్‌‌ను విజయవంతంగా జరిగింది.

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బోస్టన్‌లోని గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో మాన్సీఫీల్డ్‌ టౌన్‌లో 5కే వాక్‌‌ను విజయవంతంగా జరిగింది. గ్లోబల్‌ గ్రేస్‌ హె‌ల్త్‌తో కలిసి తానా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వాక్‌ను నిర్వహించారు (NRI).

ఈవెంట్ కోసం సంఘం అంతటా రన్నర్లు, వాకర్లు సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న వారు రెండు సంస్థలు ప్రత్యేకంగా రూపొందించి అందించిన టీ-షర్టులు, క్యాప్‌లను ధరించి ఉత్సాహంగా కనిపించారు.

TANA: తానా వైద్యశిబిరం విజయవంతం.. 550 మందికి చికిత్స


ఓ గొప్ప కారణంతో చేపట్టిన ఈ కార్యక్రమం.. ఫిట్‌నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, ఒక గొప్ప మద్దతుదారులను ఒకచోట చేర్చింది. నడక, అల్పాహారం తర్వాత తానా ప్రతినిధులు సమాజానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను పరిచయం చేశారు. ఇందుకు సంంధించి పలు వివరాలు వెల్లడించారు. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అవగాహనపై దృష్టి సారించిన కార్యక్రమాలను హైలైట్ చేశారు. కార్యక్రమానికి హాజరైన వారిని వాటిల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు.

తానా నాయకులు కృష్ణప్రసాద్ సోంపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ యెండూరి శ్రీనివాస్, మంచి కార్యక్రమాల నిర్వహణలో అందరూ భాగస్వాములవ్వాలన్న తలంపుతో ఇలాంటి కార్యక్రమాలను తానా ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు.

NRI: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు


తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్‌ వల్లేపల్లి తన సందేశంలో ఫౌండేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సేవే ప్రధానముగా తానా చేస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ స్వచ్ఛంద సేవకుల స్పందనను ప్రశంసించారు.

మురళీ పసుమర్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, రమేష్ బాబు తల్లం, చాంద్, గోపి నెక్కలపూడి, సురేష్ దోనేపూడి, రామకృష్ణ కొల్లా, సురేష్ దగ్గుబాటి, కృష్ణ నావాల, వేణు కున్నమనేని, శ్రీనివాస్ కంతేటి, రమణ తిరువీధి, ఔత్సాహిక మహిళా రన్నర్లు, వాలంటీర్‌లు, పాల్గొన్నారు.

NRI: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే చంద్రబాబు ధ్యేయం: ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest and NRI News

Updated Date - Oct 08 , 2024 | 09:06 AM