ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TANA: వరద బాధితుల కోసం తానా ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు ముమ్మరం

ABN, Publish Date - Sep 13 , 2024 | 08:06 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను తానా ఫౌండేషన్ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ ముమ్మరంగా చేస్తున్నారు.

  • ఎన్టీఆర్ జిల్లాలో, బొబ్బర్లంకలో నిత్యావసర వస్తువులు, వస్త్రాల పంపిణీ

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను తానా ఫౌండేషన్ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ ముమ్మరంగా చేస్తున్నారు (NRI) . ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ జిల్లా కార్యాలయంలో వరద సహాయ కార్యక్రమాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణి చేశారు. అలాగే అవనిగడ్డలో బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

TANA: తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితి


మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 200 వరద బాధిత కుటుంబాల వారికి తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది రకాల నిత్యావసర సరుకులు, టవల్స్ సహాయంగా పంపిణీ చేశారు. గ్రామంలోని ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, 1కేజీ కందిపప్పు, 1 కేజీ గోధుమపిండి, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ సాల్ట్, 1/2 కేజీ పుట్నాలపప్పు, 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు, 100 గ్రాముల సాంబార్ పౌడర్, 100 గ్రాముల పసుపు, 100 గ్రాముల కారం, ఒక కండువా చొప్పున నిత్యావసర సరుకులను సంస్థ వారు అందజేశారు.

NRI: ఏపీ సీఎం సహాయనిధికి ‘నాక్స్’ రూ.30 లక్షల విరాళం


ఎన్టీఆర్ జిల్లాలో తానా ఫౌండేషన్ సహాయ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ స్టేట్ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రమేష్, శ్రీధర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్‌రామ్ పాల్గొని తానా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. కృష్ణానది వరదలతో సర్వం కోల్పోయిన లంక గ్రామాలలోని ప్రజలకు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చి జిల్లాల్లో సుమారుగా ఆరు వేల కుటుంబాలకు సహాయమందించిన తానా సంస్థకు, ఛైర్మన్ శశికాంత్‌కు, ఇతర తానా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తానా సభ్యులు చొరవను ప్రశంసించారు.

NRI: తానా కాన్ఫరెన్స్- 2025 ప్రణాళిక కమిటీ నియామకం

కార్యక్రమంలో సర్పంచ్ దొప్పలపూడి గంగాభవాని టిడిపి గ్రామ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి బీవీ రావు, వేమూరి వెంకటరావు, స్వచ్ఛంద కార్యకర్తలు శశికళ, సోనీబాబు, సుకన్య, దివ్య, రాము తదితరులు పాల్గొన్నారు.ఈ సహాయ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తానా టీమ్‌ను తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రశంసించారు.

విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజల సహాయార్థం మంత్రి కొలుసు పార్థసారధి సూచన మేరకు వెయ్యి దుప్పట్లు, వెయ్యి టవల్స్‌ను తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, సెక్రెటరీ రాజ కసుకుర్తి, సభ్యులు గోగినేని కార్తీక్ సమకూర్చారు, సుంకోళ్ళు గ్రామం ఆధ్వర్యంలో 100 రైస్ బాగ్స్ విజయవాడ తరలించారు. వీటిని శుక్రవారం నాడు మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ కృష్ణలంక ఏరియాలో పంపిణీ చేశారు.

Read Latest and NRI News

Updated Date - Sep 13 , 2024 | 09:06 PM

Advertising
Advertising