NRI: మాండలికాలను సంరక్షించుకోవాలి.. నెల నెలా తెలుగు వెలుగు సదస్సులో వక్తలు
ABN, Publish Date - Nov 27 , 2024 | 03:37 PM
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదిక మీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచ సాహిత్య వేదికకు మాత్రమే సాధ్యమైందన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “మన భాష – మన యాస”, “మాండలిక భాషా అస్తిత్వం” అనే కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరకి తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వివిధ ప్రాంతాల మాండలిక భాషలు.. వాటి సొగసును ఆయన సోదాహరణంగా వివరించారు.
Also Read: కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ..“కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తెలుగు నేల నుంచి తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతోపాటు శ్రీలంక, మయన్మార్, మారిషస్ తదితర దేశాలకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబాల వారు సైతం వివిధ రకాల యాసలతో తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి శతాబ్దాలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. మాండలిక భాషలోని సహజ సౌందర్యం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురికాకుండా అస్తిత్వం నిలుపుకుంటూ మాండలిక భాషలో ఎంతో సాహిత్య సృజన చేయవలసిన అవసరం ఉందన్నారు.
Google Maps: ఉత్తరప్రదేశ్‌లో కారు ప్రమాదం... స్పందించిన గూగుల్
మన దేశంలో లంబాడీ గిరిజన మహిళ విశ్వ విద్యాలయం.. తొలి మహిళ ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యా ధనంజయ్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ముఖ్యమైన అంశంపై సమావేశం నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక కృషిని అభినందించారు. మాండలిక భాషలతో పాటు, లిపి లేని లంబాడీ భాషల లాంటి భాషలకు లిపిని కల్పించి.. ఆయా భాషలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె స్పష్టం చేశారు. లిపి ద్వారా ఆయా తెగల జీవన విధానం, ఆచార వ్యవహారాలను సజీవంగా చిత్రీకరించవచ్చని ఆచార్య డాక్టర్ సూర్యా ధనంజయ్ పేర్కొన్నారు.
Also Read: ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ఇక ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ పూర్వ భాషా, సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డా. డి. విజయభాస్కర్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర యాస’ అస్తిత్వంపై శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం ప్రాంతాల ప్రజల యాసలోని మాధుర్యాన్ని, ఆ సాహిత్య సృజన చేసిన ఆయా ప్రాంత కవుల, రచయితల పాత్రలను సోదాహరణగా వివరించారు. అలాగే లిపి లేని “రెల్లి” జాతికి చెందిన ప్రముఖ రచయిత మంగళగిరి ప్రసాదరావు మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులుగా రెల్లి కులస్తులు చేస్తున్న సేవను ఈ సందర్భంగా కొనియాడారు. రెల్లి భాషకు లిపి కల్పించాలన్నారు. ఆ భాషలో ఎక్కువ సాహిత్యం వస్తేనే.. వారి జీవనవిధానంపై యితరులకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.
Also Read: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసం.. మరొకటి వెలుగులోకి..
విద్యా రంగంలో 50కిపైగా డిగ్రీలు సాధించిన అరుదైన విద్యావేత్త, మానసిక వైద్య నిపుణులు, ‘అర్థం-పర్థం’ అనే శీర్షికతో ఇప్పటికే ఏడు వందలకుపైగా ఎపిసోడ్స్ రాసిన తెలుగు భాషాభిమాని డా. కర్రి రామారెడ్డి ప్రసంగం అద్యంతం అందరినీ ఆకట్టుకుంది.
Also Read: మజ్జిగ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ప్రముఖ రచయిత, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ మాండలికంలో నిత్యం వాడుకలో ఉన్న అనేక పదాలకు అర్థాలు, వాటి విశిష్టతను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Also Read: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో భాషాశాస్త్రంలో సహయాచార్యులు డా.గట్ల ప్రవీణ్ తెలంగాణా భాషా మాధుర్యంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మాండలిక భాషల మధ్యనుున్న వ్యత్యాసాలను ఆయన సోదాహరణంగా వివరించారు.
Also Read: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదిక మీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచ సాహిత్య వేదికకు మాత్రమే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక
For More NRI News And Telugu News
Updated Date - Nov 27 , 2024 | 06:06 PM