ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు సదస్సు

ABN, Publish Date - Nov 22 , 2024 | 07:15 AM

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ నెల చివరి ఆదివారం మన భాష- మన యాస మాండలిక భాషా అస్తిత్వంపై..

Tana

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ నెల చివరి ఆదివారం మన భాష- మన యాస మాండలిక భాషా అస్తిత్వంపై నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. ఈనెల నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యాధనంజయ్ పాల్గొంటారని తెలిపారు. ఆమె లిపి లేని లంబాడీ భాషా అస్తిత్వంపై ప్రసంగిస్తారని కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. విశిష్ట అతిథులుగా రచయిత డాక్టర్ డి.విజయభాస్కర్, దళితుల్లో దళితులు గరంథ రచయిత మంగళగిరి ప్రసాదరావు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి, సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, కాశీ హిందూ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ గట్ల ప్రవీణ్ పాల్గొంటారని తెలిపారు.


వివిధ అంశాలపై

నవంబర్ నెలలో నిర్వహించే నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో ఆరు అంశాలపై అతిథులు ప్రసంగించనున్నారు. లిపి లేని లంబాడీ భాషా అస్తిత్వంపై హైదరాబాద్‌కు చెందిన ఆచార్య డాక్టర్ సూర్యా ధనంజయ్ ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్ర యాస అస్తిత్వంపై శ్రీకాకుళానికి చెందిన సుప్రసిద్ధ రచయిత, పూర్వ ఆంధద్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డాక్టర్ డి.విజయ్ భాస్కర్ మాట్లాడతారని నిర్వహకులు వెల్లడించారు. లిపి లేని రెల్లి భాషా అస్తిత్వంపై విశాఖపట్టణానికి చెందిన జాతీయ పురస్కార గ్రహీత, దళితుల్లో దళితులు గ్రంథ రచయిత మంగళగిరి ప్రసాదరావు ప్రసంగిస్తారు. అర్థం- పర్థం అనే అంశంపై రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రసంగిస్తారు. ఆయన అత్యధికంగా 42 డిగ్రీలు సాధించడంతో పాటు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. రాయలసీమ అస్తిత్వం అనే అంశంపై కడపకు చెందిన డాక్టర్ చింతకుంట శివారెడ్డి మాట్లాడతారు. తెలంగాణ మాండలిక అస్తిత్వంపై కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గట్ల ప్రవీణ్ ప్రసంగించనున్నారు.


ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నెల నెలా తెలుగు వెలుగు 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం కార్యక్రమం భారత కాలమాన ప్రకారం నవంబర్ 24 (ఆదివారం) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. వర్చువల్ విధానంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 22 , 2024 | 07:15 AM