ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: దేశంలో మొదటిసారిగా గల్ఫ్ మృతులకు పరిహారం!

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:50 PM

గల్ఫ్ దేశాలలో మృతి చెందిన ప్రవాసీయుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అయిదు లక్షల రూపాయాల ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

  • ఫలించిన గల్ఫ్ ఎన్నారై సెల్ కృషి

  • ఎట్టకేలకు తీరిన గల్ఫ్ మృతుల కుటుంబాల కోరిక

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో మృతి చెందిన ప్రవాసీయుల (NRI) కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అయిదు లక్షల రూపాయాల ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కేరళ సహా దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన భరోసా గల్ఫ్ ప్రవాసీయుల కుటుంబాలకు లేదు, దేశంలో ప్రప్రథమంగా తెలంగాణలో దీని అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది.

NRI: సౌదీలో తెలుగు ఆత్మీయ సమ్మేళనం కోసం జోరందుకున్న ఏర్పాట్లు!


ఈ విషయమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు వాగ్దానం చేసినప్పటికీ హామి అమలు కాలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దిశగా అడుగులు ముందుకు వేశారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి పలుదఫాలుగా చర్చలు జరిపిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశానంతరం సోమవారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

NRI: యూఏఈ అమ్నెస్టీ గురించి తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవాలి: ఐపీయఫ్

పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ జి. వినోద్, గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వివిధ రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుండగా వీరికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిలు పూర్తి మద్దతునిచ్చారు.

Dubai: దుబాయి తెలుగు సంఘంపై దుష్ప్రచారం జరుగుతోంది: సంస్థ ప్రతినిధులు


గల్ఫ్ ప్రవాసీయుల కుటుంబాలకు భరోసా కల్పించినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎడారిలో బతుకమ్మ ఆడిపించి కేసీఆర్ కుటుంబం గల్ఫ్ ప్రవాసీయులను దగా చేసింది కానీ చేసింది ఏమి లేదని ఎద్దేవా చేసారు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ కేసీఆర్ కుటుంబం గల్ఫ్ ప్రవాసీయులను మోసం చేయగా కాంగ్రెస్ సర్కారు ఆదుకొందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read Latest and NRI News

Updated Date - Sep 17 , 2024 | 02:53 PM

Advertising
Advertising