ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: బహ్రెయిన్‌లో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ABN, Publish Date - Jun 20 , 2024 | 03:11 PM

బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల పరంపర విదేశాలలో ఇప్పటికీ కొనసాగుతోంది. సెలువు దినాలలో ఉత్సవాల ఉత్సాహం రెట్టింపవుతోంది. గల్ఫ్ దేశాలలో హజ్ (బక్రీద్) సెలువులు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించింది.

మన బొట్టు మన కట్టు మన పాట మా బోనం అన్న రీతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. తెలంగాణ జానపద గేయాలు మొదలు రంగుల పోటీల వరకు వైవిధ్యభరితంగా జరిగిన ఈ వేడుకలలో తెలంగాణ ప్రవాసీయులు (NRI) ఉత్సాహంగా పాల్గొన్నారు. సల్మాబాద్‌లోని లేబర్ క్యాంపులలోని సగటు కార్మికుల నుండి ఆదీలియాలోని తెలుగు కుటుంబాల చిన్నారుల వరకు తమకు నచ్చిన కళలను ప్రదర్శించే ప్రయత్నం చేసారు.

NRI News: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ


బహ్రెయిన్‌లో ప్రాంతాలకు అతీతంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులకు కష్టకాలంలో అపన్న హస్తం అందించే కార్మిక బంధువు దొర్నాల శివకుమార్ అలియాస్ శివ, నోముల మురళీల సేవారీతిని కొనియాడుతూ నిర్వాహకులు వీరిరువురికీ శాలువ కప్పి సన్మానించారు.

కార్యక్రమాన్ని నూతనంగా ఎన్నికయిన బహ్రెయిన్ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీశ్, ఉపాధ్యక్షులు రాజకుమార్, ప్రధాన కార్యదర్శి పల్ల ప్రసాద్ కోశాధికారి నాగ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి లత, కార్యవర్గ సభ్యులు గంగ సాయి, చంద్రబాబు, సంతోష్, దీపక్ ఇతరులు నిర్వహించారు.

సందర్భానుసారం సన్నివేశాలకు అనుగూణంగా వేద శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు కూడా అందర్నీ ఆకట్టుకుంది.

బహ్రెయిన్‌లోని తెలుగు వారి సంక్షేమం, సాంస్కృతిక వికాసం కోసం తెలుగు కళా సమితి నిరంతరం కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షుడు జగదీశ్ పేర్కొన్నారు.

ప్రవాసీ తెలుగు ప్రముఖులు రఘునాథ బాబు, ఆర్.యస్.యస్. మురళీ, హరిబాబు, మురళీకృష్ణ, ద్విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 03:13 PM

Advertising
Advertising