NRI: గల్ఫ్ దేశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు!
ABN, Publish Date - Jun 03 , 2024 | 06:29 PM
ఎడారి దేశాలలోని తెలంగాణ ప్రవాసీయులు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పోటాపోటిగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలోని తెలంగాణ ప్రవాసీయులు (NRI) తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పోటాపోటిగా ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న మొదలయిన ఉత్సవాలు వివిధ ప్రాంతాలలో మరో రెండు వారాల వరకు కొనసాగనున్నాయి. అబుదాబి, బహ్రెయిన్‌లలో ఆదివారం ఘనంగా జరగ్గా దుబాయి, కువైత్ మరియు ఖతర్‌లలో కూడా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అబుధాబిలో..
అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఆవిర్భావ దశాబ్ది కార్యక్రమంలో అధ్యక్షుడు రాజ శ్రీనివాస రావు ఉద్యమకాలంలో గల్ఫ్‌లోని ప్రవాసీయులు నిర్వహించిన పాత్రను గుర్తు చేసారు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదని అది ఒక స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు.
బహ్రెయిన్‌లో...
బహ్రెయిన్‌లోని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టి.సి.ఏ) ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించింది. స్వరాష్ట్రమే హక్కుగా ఆవిర్భవించిన ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి పురోగతితో పాటు తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కూడా ముఖ్యమని వక్తలు ఇ. పోచయ్య, కొత్తపల్లి రాజశేఖర్, వెంకటస్వామి, పయ్యావుల శ్రీనివాస్, ఆలే గంగాధర్, కోటగిరి నవీన్, సంజీవ్ గాండ్లలు పేర్కొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విజయవర్ధన్ వ్యవహరించారు. తెలంగాణ ప్రముఖులు గంగుల సుదర్శన్, డాక్టర్ సుభాష్ రెడ్డి, రాంరెడ్డి, విఠల్, ప్రేంసాగర్, శ్రీకాంత్, ప్రమోద్ రెడ్డి, శంకర్, లింగన్న, సుధాకర్, మోహమ్మద్ సాదిఖ్, ఇబ్రహీం, కిరణ్ ఉప్పల, రతన్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఇక నుండి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను క్రీయాశీలకంగా చేపడతామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కార్మికబంధు శివకుమార్‌తో పాటు స్థానిక ప్రముఖుడు వాసుదేవరావు కూడా పాల్గొన్నారు.
బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. బహ్రెయిన్‌లో ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరి కోసం కృషి చేసే తెలుగు కళా సమితి నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు కళా సమితి అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షత వహించగా రఘునంద బాబు, మురళీ కృష్ణా, వంశీ, ఫణి భూషణ్, పల్లా ప్రసాద్, రాజ్ కుమార్, గంగాసాయి, ద్విజేంద్ర, శ్రీనివాస్, విజేంద్రరెడ్డిలు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ సెలువు రోజుల మొదటి దినమైన17న తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా హరిబాబు వెల్లడించారు.
దుబాయిలో..
దుబాయిలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వచ్చే ఆదివారం నిర్వహించడానికి వివిధ తెలంగాణ సంఘాలు కసరత్తు చేస్తున్నాయి.
ఖతర్‌లో..
ఖతర్‌లో కూడా రెండు తెలంగాణ సంఘాలు వేర్వేరుగా రానున్న వారాంతపు సెలువు దినాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Latest NRI News and Telugu News
Updated Date - Jun 03 , 2024 | 06:53 PM