ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః

ABN, Publish Date - Sep 09 , 2024 | 07:17 AM

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాలలోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదాపు అన్ని అపార్ట్‌మెంట్లలో విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాలలోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదాపు అన్ని అపార్ట్‌మెంట్లలో విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది.

దుబాయి, మస్కట్, మనమాలలోని దేవాలయాలతో పాటు ఆజ్మాన్ మైత్రి ఫాంలో ప్రతిష్ఠించిన బొజ్జ గణపయ్యను నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించి పూజలు చేస్తున్నారు. ఈ నాలుగు చోట్ల మినహాయించి మిగిలిన ప్రదేశాలలో దాదాపుగా ఒకటి నుంచి మూడు రోజులకు నిమజ్జనం జరుగుతుంది. భారతదేశంలో మాదిరిగా కాకుండ గల్ఫ్ దేశాలలో మూడు రోజులలోపు మాత్రమే నిమజ్జనం చేస్తుంటారు.


దుబాయిలో

దుబాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి భారీ ఎత్తున వినాయక విగ్రహామూర్తుల విక్రయాలు జరిగాయి. గంటల తరబడి క్యూలలో నిల్చుండి వినాయకుడి ప్రతిమలను కొనుగోలు చేశారు. బర్ దుబాయి, కరామా ప్రాంతాలలో గణపతి పూజలు జరుగుతున్నాయి. శని, ఆదివారాలలో దుబాయిలోని రెండు దేవాలయాలలో కూడా గణపతి పూజలకు ఎనలేని భక్తుల తాకిడి కనిపించింది. ఈ సారి జబల్ అలీ దేవాలయంలో రఘు అనే కొత్త తెలుగు పూజారి అర్చక సేవలు అందించడం ప్రత్యేకతగా నిలిచింది. కొందరు శనివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించి అదే రోజు అర్ధ రాత్రి నిమజ్జనం చేయగా మరికొందరు 3 రోజుల అనంతరం సోమవారం అరేబియా సముద్రంలో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బోట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉంది.


ఆజ్మాన్‌లో...

ఆజ్మాన్‌లో తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు ఆజ్మాన్‌లోని తన మైత్రీ ఫాంలో ప్రతిష్ఠించిన బొజ్జ గణపతి ఈ సారి కూడా తెలుగు ప్రవాసీయులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటిసారిగా నవరాత్రుల కోసం తాము ప్రత్యేకంగా ఆజ్మాన్‌కు వెళ్లి గణపతి పూజలు చేయడానికి ఆసక్తితో ఉన్నట్లుగా దుబాయిలో నివాసముండే హైదారాబాద్ నగరానికి చెందిన గృహిణి జ్యోతి అన్నారు. ఉద్యోగ రీత్యా గణపతి పూజ నిర్వహించిన రోజు రాత్రే తాను నిమజ్జనం చేశానని షార్జాలోని తెలుగు ప్రవాసీయురాలు భారతి రెడ్డి అన్నారు. తొమ్మిదవ రోజు ఉరేగింపుతో వైభవంగా మేళ తాళాలతో భక్తుల కోలాహాలం, సంప్రదాయక మంగళ వాయిద్యాలతో అరేబియా సముద్రంలో నిమజ్జనం చేయనున్నట్లుగా కేసరి త్రిమూర్తులు వెల్లడించారు.


సౌదీలోని దమ్మాంలో..

ప్రపంచంలోకెల్లా అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని దమ్మాం ప్రాంతంలోని తెలుగు కుటుంబాలన్నీ గణనాథా నమోనమః అంటూ భక్తితో పరవశించాయి. తెలుగు ప్రవాసీ సంఘం సాటా ప్రతినిధులు తేజ వర్షిత, సురేశ్, రాధ సమన్వయంతో శుక్రవారం చేసిన వినాయక చవితిలో వెయ్యికి పైగా కుటుంబాలు పాల్గొన్నాయి. ప్రప్రథమంగా తాము వినాయక చవితిలో పాల్గొనడంతో జన్మ సాఫల్యమైందని పాకిస్థాన్‌కు చెందిన కొన్ని హిందు కుటుంబాలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించాయి. భజన గీతాలు, వినూత్న భక్తి కార్యక్రమాలతో విశాఖపట్టణానికి చెందిన సంధ్య, సురేశ్ నాయుడు భక్తుల మన్నలను పొందారు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తారక్, జగదీశ్, రవి భోజన ఏర్పాట్లు చేశారు. వినాయకుడి అలంకరణ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రియా సుబ్బు, లీలా, శిల్పా, దివ్య, ప్రవీణా, విజయలక్ష్మి తదితరులు నిర్వహించారు. గణపతి వేలం పాటలో ఒంగోలుకు చెందిన ఈశ్వర రావు 3 వేల రియాళ్లకు లడ్డూను దక్కించుకున్నారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ అదే రోజు అర్ధ రాత్రి వినాయకుడిని తేజ, సురేశ్, సుబ్బు, పవన్ తదితరులు నిమజ్జనం చేశారు.


జెద్ధాలో..

జెద్ధా నగరంలో కూడా వినాయక చవిత పండుగ ఉత్సవాలు జరిగాయి. సాటా సభ్యులు రాకేశ్, నాగరాజు, లక్ష్మి, రామలక్ష్మిల అధ్వర్యంలో జరిగిన వినాయక చవితి కార్యక్రమంలో సౌమ్య రూపొందించిన బొజ్జ గణపయ్య విగ్రహాం భక్తులను ఆకట్టుకుంది. రాము, నరేష్, అలోక్, రోమేశ్, హరి, అప్పు తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. రియాధ్ నగరంలో వచ్చేవారం నిమజ్జనం నిర్వహించనున్నట్లుగా సాటా అధ్యక్షుడు మల్లేశన్ అన్నారు.


బహ్రెయిన్‌లో..

బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ప్రతిష్ఠించిన వినాయకుడిని ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు సందర్శించుకుంటూ పూజలు చేస్తున్నారు. స్థానిక శ్రీ కృష్ణ మందిరంతో పాటు కొన్ని ఇతర లేబర్ క్యాంపులలో కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెప్సీ క్యాంపులో గంగాధర్, అశోక్, తిరుపతిల అధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. అదే విధంగా, పద్మశాలీ సమాజ్ అధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు ఈ సారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.


దమ్మాంలో..


బహ్రెయిన్‌లో..


జెద్ధాలో

Updated Date - Sep 09 , 2024 | 07:30 AM

Advertising
Advertising