NRI: అరబ్బునాట ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆదర్శం!
ABN, Publish Date - Sep 29 , 2024 | 08:22 PM
రియాధ్ నగరంలో నివసించే ఏడవ తరగతి విద్యార్థిని ధాయత్రి భవనం, ఆరవ తరగతి చదివే ఆరాధ్య భవనం అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం విలక్షణ స్వభావం కల్గిన వారు. పరాయిగడ్డ పై సేవా దృక్ఫథంతో చిన్నవయసులోనే పలువురు మన్ననలు పొందారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లే చిన్నారులు తమ చదువులు లేదా స్మార్ట్ ఫోన్లు మీద వ్యామోహం పడుతున్న ప్రస్తుత కాలంలో వారికి ఇంటి భాద్యతలు పట్టవు. కనీసం తమ స్కూల్ బ్యాగులు సరిగ్గా పెట్టుకొంటే చాలు అన్న పరిస్థితులలో సామాజిక స్పృహా కల్గిన చిన్నారులు అతి అరుదు! అందునా ముక్కు ముఖం తెలియని పరాయిగడ్డ పై సేవా దృక్ఫథం కల్గిన వారు మరీ అరుదు (NRI).
రియాధ్ నగరంలో నివసించే ఏడవ తరగతి విద్యార్థిని ధాయత్రి భవనం, ఆరవ తరగతి చదివే ఆరాధ్య భవనం అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం విలక్షణ స్వభావం కల్గిన వారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరిలోనూ సామాజిక స్పృహా ఎక్కవ. గుంటూరులో పుట్టినప్పటికీ ఈ ఇద్దరు చిన్నారులు తమకు ఊహ తెలిసినప్పటి నుండి గల్ఫ్‌లో ఉంటున్నారు.
NRI: కష్టాల కడలి నుండి మాతృదేశానికి తెలుగు మహిళ
పరాయి గడ్డపై పేదలపై దృష్టి సారించడం అనేది అందరికీ సాధ్యం కాదు కానీ ఈ ఇద్దరు చిన్నారులు తమకు కనిపించిన పేద కార్మికులను కలుస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటుంటారు. వారి సంపద, స్వదేశంలో వారి పిల్లల చదవుల గురించి వాకబు చేస్తుంటారని రియాధ్ నగరంలో వారు నివాసముండే పరిసర ప్రాంతాల్లోని వారు చెప్పారు.
ఒక రోజు ఈ ఇద్దరికి ఒక చేతి పర్సు లభించగా, వారు దాన్ని యాజమానికి అందించడానికి అహర్నిశం కృషి చేశారు. ఈ సందర్భంగా పర్సు పొగ్గొట్టుకున్న వ్యక్తి వీరి నిజాయితీని ప్రశంసిస్తూ కన్నీళ్ళు పెట్టుకొన్నట్లుగా సమీపంలోని ఒక సూపర్ మార్కెట్‌లో పని చేసే భారతీయుడొకరు చెప్పారు.
NRI: తానా ఫౌండేషన్ సహాయం.. 60 బాలికలకు సైకిళ్ళ పంపిణీ
NRI: బే ఏరియాలో ‘దేవర' ఫీవర్.. ఫ్యాన్స్ హంగామా!!
ఇటీవల రియాధ్ నగరంలో జరిగిన సాటా తెలుగు భాష దినోత్సవం వేడుకలలో దాదాపు బాలికలందరు ఆడుతూ పాడుతూ గడుపగా ఈ ఇద్దరు మాత్రం సభికులకు భోజనం ఏర్పాట్లలలో నిర్వహకులకు సహకరించారు. తాము తినకుండా ఇద్దరు అక్కాచెల్లెళ్లు అతిథులకు వడ్డించి అందరి మన్నలు పొందారు.
ఇద్దరు కూడా ఉదయం పాఠశాలకు వెళ్ళకముందు వినాయకుడ్ని పూజించి వెళ్తారని తల్లి శిల్పా రెడ్డి చెప్పారు. ధాయత్రికు పుస్తక పఠనం పై అమిత ఆసక్తి కాగా ఆరాధ్యకు చిత్రలేఖనం మక్కువ.
రాంరెడ్డి స్వస్ధలం బాపట్ల జిల్లా పరుచూరు సమీపంలో సుబ్బారెడ్డిపాలెం గ్రామం. ఆయన సౌదీ అరేబియా కంటె ముందు ఖతర్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ మరియు వియత్నాం దేశాలలో పని చేసారు.
Updated Date - Sep 29 , 2024 | 09:20 PM