ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: వైభవంగా టీపాడ్‌ బతుకమ్మ, దసరా వేడుకలు

ABN, Publish Date - Oct 09 , 2024 | 12:49 PM

తెలంగాణ మురిసిపోయేలా, అమెరికాలోని డాలస్‌ మైమరిచిపోయేలా తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌) నిర్వహించిన సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఎన్నారై డెస్క్: తెలంగాణ మురిసిపోయేలా, అమెరికాలోని డాలస్‌ మైమరిచిపోయేలా తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌) నిర్వహించిన సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డాలస్‌లోని అల్లెన్ ఈవెంట్‌ సెంటర్‌ ఈ వేడుకకు వేదికగా మారింది. సుమారు 10 వేల మందికి సరిపోయే ఈ ఇండోర్‌ స్టేడియానికి మహిళలు బతుకమ్మలతో భారీగా తరలిరావడంతో చివరకు నో ఎంట్రీ అంటూ స్టేడియం నిర్వాహకులు ఫైర్‌కోడ్‌ అలర్ట్‌ చేశారు. బయటే ఉండిపోయిన సుమారు 5వేల మందికి నిర్వాహకులు అక్కడే బతుకమ్మ ఆడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అందాలనటి ప్రియాంకమోహన్ రాకతో ఈ వేడుకకు మరింత శోభ చేకూరింది. సాయంత్రం మహిషాసుర మర్ధిని కార్యక్రమంతో పాటు అలయ్‌బలయ్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ షడ్రసోపేతమైన భోజనం ఏర్పాటు చేశారు. చివరగా తెలుగు సినీ నేపథ్య గాయకుడు రామ్‌ మిరియాల.. రెండున్నర గంటలపాటు లైవ్‌కన్సర్ట్‌తో అందరినీ ఉర్రూతలూగించారు. పాటపాటకూ అడుగులేస్తూ చివరికి అలసిపోయినా హుషారు నిండిన ఆనందంతో అందరూ ఇళ్లకు వెళ్లారు (NRI).

NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!


టీపాడ్‌ ఏటా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ కార్యక్రమానికి ఫౌండేషన కమిటీ చెయిర్‌ జానకీరాం మందాడి, ప్రెసిడెంట్‌ రూపా కన్నయ్యగారి, బీవోటీ చెయిర్‌ బుచ్చిరెడ్డి గోలి, కోఆర్డినేటర్‌ రవికాంత్ మామిడి నేతృత్వం వహించగా టీపాడ్‌ బృంద సభ్యులందరూ అలుపెరగని సహకారం అందించారు.

సంబరంలో ప్రియాంకమోహన్, రామ్‌ మిరియాల

వేడుక అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ కథానాయిక ప్రియాంకమోహన్ ఆశ్చర్యపోయారు. తన జీవితకాలంలో ఇంత పెద్ద పండుగ ఈవెంట్‌ను చూడలేదని, ఇది తనకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. అమెరికా గడ్డపై ఇన్ని వేల మంది తెలుగువారి మధ్య పాటలు పాడటం మరిచిపోలేమని, టీపాడ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని రామ్‌ మిరియాల బృందం సంతోషం వ్యక్తం చేసింది.

జాతరను తలపించిన అల్లెన్ సెంటర్‌ ప్రాంగణం

బతుకమ్మ వేడుకల సందర్భంగా అల్లెన సెంటర్‌ ప్రాంగణంలో జాతరను తలపించేలా దుకాణాలు వెలిశాయి. చీరలు, నగలు, బొమ్మల దుకాణాలు సహా పిల్లలు మారాం చేసి కొనిపించేలా వ్యాపారులు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వెరైటీ చిరుతిళ్ల స్టాళ్లు అనేకం వెలిశాయి.

NRI: అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం వారి బతుకమ్మ సంబరాలు


పదేళ్లుగా బతుకమ్మ, దసరా వేడుకలు

విదేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్న అసోసియేషన్లలో టీపాడ్‌ పాత్ర ప్రత్యేకమనే చెప్పాలి. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తెలుగువారందరూ ఆదరిస్తుండడమే కాకుండా విశేషరీతిలో విజయవంతం చేస్తున్నారు. పండగ పూట తెలుగుగడ్డకు దూరంగా ఉన్నామనే భావన ఇక్కడ స్థిరపడిన వారిలో రాకుండా సంప్రదాయ విలువలతో కూడిన ఏర్పాట్లు చేస్తుండడం వల్ల వీరి కార్యక్రమాలకు అపూర్వ స్పందన వస్తోంది. ఏటా పదివేల మందికి తగ్గకుండా జనం హాజరు కావడం టీపాడ్‌ నిర్వాహకుల విశ్వసనీయతకు నిదర్శనంగా చెప్పవచ్చు. దశాబ్దకాలంగా తాము చేపడుతున్న కార్యక్రమాలను ఆదరిస్తున్న తెలుగువారందరికీ టీపాడ్‌ బృందం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

Read Latest and NRI News

Updated Date - Oct 09 , 2024 | 12:49 PM