ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
ABN , Publish Date - Jan 24 , 2024 | 09:22 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి చారిటబుల్ ట్రస్టుల ద్వారా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. అలాగే పేదలకు భోజనాలు పెట్టి, వస్త్ర దానాలు చేశారు. తన పుట్టిన రోజును ఓ పండుగలా జరిపిన ప్రతి ఒక్కరికీ నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలోని 1000 కేజీల కేకులు కట్ చేసి.. వేడుకలు జరుపుకున్న టీడీపీ నేతలు..
నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయం మంగళగిరిలోని భారీ కట్ చేసి.. సంబరాలు చేసుకున్న మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, కాలవ శ్రీనివాసులు, కళా వెంకట్రావు తదితరులు..
నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కడపలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వివిధ అనాధ శరణాలయాల్లో కేక్ కట్ చేసి దుప్పట్లు. అన్నదానం చేసిన కడప నియోజకవర్గం ఇన్చార్జి మాధవిరెడ్డి. రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, కార్యకర్తలు తదితరులు..
నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కటింగ్ చేస్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మహేష్ యాదవ్ తదితరులు.
టీడీపీ జాతీయ కార్యాలయం మంగళగిరిలోని లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి.. రక్త దానం చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలు..
నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం. ప్రక్కన స్వర్గీయ ఎర్రం నాయుడు విగ్రహం చూడవచ్చు.
నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేదలకు అన్నదానం చేస్తున్న దృశ్యం.
Updated Date - Jan 24 , 2024 | 09:22 AM