ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kutami: అనకాపల్లిలో పోటెత్తిన ప్రజాగళం..

ABN, Publish Date - May 07 , 2024 | 12:21 PM

అనకాపల్లి జిల్లా: కశింకోట మండలం తాళ్లపాలెంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఏర్పాటుచేసిన సభకు దేశ ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. తండ్రి (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి) శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను కొడుకు (జగన్మోహన్‌రెడ్డి) ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, అంటే దీన్నిబట్టి చూస్తే రైతుల పట్ల వైసీపీకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. వైఎస్ఎర్ పార్టీ అనగానే అందరికీ గుర్తుకువచ్చేది ఇసుక మాఫియా, భూదందా, లిక్కర్‌ స్కామ్‌లు అని ప్రధాని విమర్శలు గుప్పించిన సందర్భంలో ప్రజలు కేరింతలు కొట్టారు.

1/6

అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం, తాళ్లపాలెంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభకు విచ్చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

2/6

అనకాపల్లి జిల్లా, తాళ్లపాలెంలో కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

3/6

అనకాపల్లి జిల్లా, తాళ్లపాలెంలో కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి..

4/6

తాళ్లపాలెంలో కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం సభ వేదికపై ప్రధాని మోదీతో చేతులు కలుపుతూ విజయ దరహాసంతో కూటమి నేతలు

5/6

అనకాపల్లి జిల్లాలో కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభకు విచ్చేసిన ప్రధాని మోదీని శాలువ కప్పి సన్మానించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు..

6/6

అనకాపల్లి, ప్రజాగళం సభలోప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు ముచ్చటించుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

Updated Date - May 07 , 2024 | 12:21 PM

Advertising
Advertising