సింగపూర్‌లోని తెలుగు వారు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభా మందిరంలో శాస్త్రీయంగా కల్పోక్తరీతిలో భక్తి శ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.