ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagula Chavithi: నాగులచవితి రోజున కూరలు ఎందుకు కట్ చేయకూడదు

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:04 PM

నాగుల చవితినాడు కూరగాయలు కూడా తరగకూడదంటారు.. సూది, చాకు వంటి పదునైన వస్తువులను సైతం వాడరు. అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక మానవాళికి మేలు చేసే ఓ విశేషమైన కారణం ఉంది..

1/8

కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి తిథినే నాగుల చవితిగా జరుపుకుంటారు.

2/8

భూమి అంతర్భాగంలో ఉంటూ భూసారాన్ని కాపాడి రైతులకు మేలు చేసే సర్పాలను దేవతలుగా పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.

3/8

ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పాలు, చీమలు, ఇతర క్రిమి కీటకాలకు హాని కలగకుండా చూసుకుంటారు. అందుకే కొన్ని కచ్చితమైన నియమాలను పాటిస్తారు.

4/8

చవితి రోజున భూమిని దున్నడం, మట్టిని తవ్వడం, చెట్టు, పుట్టలను కొట్టడం వంటి పనులకు దూరంగా ఉండేవారు.

5/8

ఈ పర్వదినాన కత్తులు, సూదులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

6/8

కూరగాయలు కోసి వంట చేయరు. వాటికి బదులుగా దుంపల వంటివి ఉడికించి మాత్రమే తింటారు.

7/8

వంట చేసేందుకు ఇనుప కళాయిలు, బాణలి వంటివి ఉపయోగించరు. మట్టి పాత్రల్లోనే వంట చేసుకుని తింటారు.

8/8

తెలియకుండా కూడా చిన్న ప్రాణులకు హాని చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆచారం పాటిస్తారు.

Updated Date - Nov 04 , 2024 | 05:05 PM