ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్వీన్ అఫ్ ది సౌత్.. సిల్క్ స్మిత బర్త్ డే స్పెషల్..

ABN, Publish Date - Dec 02 , 2024 | 01:43 PM

అలనాటి నటి, క్వీన్ అఫ్ ది సౌత్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. నేడు ఈ బ్యూటీ బర్త్ డే కావడంతో ఆమె బయోపిక్ కి సంబందించిన చిన్న గ్లింప్స్ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు.

1/6

క్వీన్ అఫ్ ది సౌత్ సిల్క్ స్మిత.. అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ నటి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషలలో నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

2/6

దాదాపు 15 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె ఐదు భాషల్లో కలిపి మొత్తం 450పైగా సినిమాలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

3/6

ఏపీలోని ఏలూరు జిల్లాలో ఒక పేద కుటుంబంలో విజయలక్ష్మిగా జన్మించిన ఆమె.. సినిమాలపై ఇంట్రెస్ట్ తో మద్రాసు వెళ్లి సిల్క్ స్మిత అని పేరు మార్చుకుంది.

4/6

అనేక సినిమాలలో ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమె నటించిన బావలు సయ్యా, మరదలు సయ్యా అనే పాట ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

5/6

1996 సెప్టెంబర్ 23న స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్ లో చనిపోయింది. ప్రేమ విఫలమయిందని, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెట్టిన పెట్టుబడుల వల్ల నష్టాల పాలయిందని అందుకే ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చాయి.

6/6

నేడు ఈ బ్యూటీ బర్త్ డే కావడంతో ఆమె బయోపిక్ కి సంబందించిన చిన్న గ్లింప్స్ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి సిల్క్ స్మిత పాత్రలో నటిస్తుంది.

Updated Date - Dec 02 , 2024 | 02:26 PM