ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫారినర్లు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రాంతాలు ఇవే!

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:36 PM

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ఊపందుకుంటోంది. అనేక మంది విదేశీయులు భారత్‌వైపు క్యూకడుతున్నారు. విదేశీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టూరిస్టు స్థలాలు ఏవో తెలుసుకునేందుకు బుకింగ్స్ డాట్ కామ్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

1/12

ప్రాచీన, ఆధునిక సంస్కృతుల మేలు కలయికగా నిలిచి ఢిల్లీ ఈ జాబితాలో ముందువరుసలో నిలిచింది. రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, కుతుబ్ మినార్ వంటి స్థలాలు వీక్షించేందుకు, స్థానిక వంటకాలు రుచి చూసేందుకు ఫారినర్లు ఉత్సుకత చూపుతున్నారు.

2/12

దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా విదేశీయులను అధికంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్, గేట్ వే ఆఫ్ ఇండియా, స్ట్రీట్ లైఫ్‌ తదితరాల గురించి తెలుసుకునేందుకు విదేశీయులు ఆసక్తి కనబరిచారు. ఇక్కడి సంస్కృతి, చరిత్ర వంటి వాటిపై ఆసక్తితో అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

3/12

భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుపడ్డ బెంగళూరుకు కూడా ఫారిన్ టూరిస్టుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఇక్కడి పార్కులు, చారిత్రాత్మక స్థలాలు, బెంగళూరు ప్యాలెస్, స్థానిక వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

4/12

పింక్ సిటీగా పేరు పొందిన జైపూర్ నగరంపై విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి అంబర్ కోట, హవా మహల్ వంటి చారిత్రక నిర్మాణాల వైభవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒకప్పటి రాచరిక వైభవం చూసేందుకు విదేశీయులు ఇక్కడకు క్యూ కడుతున్నారు.

5/12

తీర నగరమైన చెన్నై దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడి మెరీనా బీచ్, దక్షిణాది వంటకాలు కూడా బాగా పాప్యులర్, దీంతో, చెన్నైకి కూడా విదేశీయుల రాక ఎక్కువ. అనేక మంది ఫారినర్లు ఈ దర్శనీయ ప్రాంతం గురించి తెలుసుకునేందుకు అంతర్జాలంలో సెర్చ్ చేశారు.

6/12

యూనెస్కో సాంస్కృతిక వారసత్వమైన హంపీ నగరం గురించి తెలుసుకునేందుకు ఫారిన్ టూరిస్టులు ఉత్సుకత ప్రదర్శిస్తున్నట్టు సర్వేలో తేలింది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలియజేసే చారిత్రక కట్టడాలు ఫారినర్లను అధికంగా ఆకర్షిస్తున్నాయి

7/12

హిమాలయాల్లోని లేహ్ ప్రాంతం కూడా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి కొండల్లో ట్రెక్కింగ్ చేసేందుకు కూడా ఫారినర్లు కూడ కడుతున్నారు. ఇక్కడి మతపరమైన కట్టడాలు వీక్షించేందుకు బారులు తీరుతున్నారు.

8/12

జమ్ముకశ్మీర్‌లోని ప్రఖ్యాత హిల్ స్టేషన్ గురించి కూడా విదేశీయులు నెట్టింట అత్యధికంగా సెర్చ్ చేశారు. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ క్రీడలు ఇష్టపడే ఫారినర్లు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

9/12

అద్భుతమైన కొండలు, లోయలు, నదులతో ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలుస్తున్న పహల్గామ్ కూడా ఫారినర్లు సందర్శిస్తున్న స్థలాల్లో ప్రధానమైనది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే కూడా ఇక్కడి నుంచే!

10/12

కూర్గ్ జిల్లాలోని మాడికేరీ కాఫీ పంటలకు ప్రసిద్ధి. ఇక్కడి ప్రకృతి అందాలు, జలపాతాలు చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే ఫారినర్లకు ఇది స్వర్గధామంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు

11/12

కృష్ణానది తీరాన ఉన్న విజయవాడ ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ప్రసిద్ధి గాంచింది. దుర్గ గుడి చూసేందుకు స్థానిక సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు కూడా విదేశీయులు విజయవాడ గురించి నెట్టింట అధికంగా సెర్చ్ చేస్తుంటారట.

12/12

భారతీయ శిల్పకళావైభవానికి ప్రతీకగా ఉన్న ఖజురహో.. ఫారినర్లను అమితంగా ఆకర్షిస్తుంటుంది. ఎన్నో దేవాలయాలు ఉన్న దీనికి యూనెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా దక్కడంతో విదేశీయులు ఇక్కడకు కూడా క్యూకడుతుంటారని బుకింగ్స్ డాట్ కామ్ సర్వేలో తేలింది.

Updated Date - Oct 19 , 2024 | 04:39 PM