Ayodhya Photos: బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు
ABN, Publish Date - Apr 17 , 2024 | 04:10 PM
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.
చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆవిష్కృతమైంది. మూడున్నర నిమిషాలపాటు సూర్య తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది.
రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాల రాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట.
సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం
Updated Date - Apr 17 , 2024 | 04:22 PM