ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:52 PM

సూర్యాపేట జిల్లా: సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్టాల్స్‌ను ప్రారంభించి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారతదేశం 2047 నాటికి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్‌ భారత్‌ కావాలని, అదే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆకాంక్షించారు. గురువారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించారు.

1/8

సూర్యాపేట జిల్లా: సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయానికి విచ్చేస్తున్న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రక్కన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య అధికారులు.

2/8

సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయానికి విచ్చేస్తున్న గవర్నర్‌కు పుష్ఫగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న జిల్లా కలెక్టర్ తేజస్‌ నందలాల్‌ పవార్‌, అధికారులు.

3/8

సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్టాల్స్‌ను ప్రారంభించారు. ప్రక్కన కలెక్టర్ తేజస్‌ నందలాల్‌ పవార్‌, అధికారులు.

4/8

వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..

5/8

స్టాల్స్‌లో ఉత్పత్తులను గవర్నర్‌కు చూపిస్తున్న జిల్లా కలెక్టర్ జస్‌ నందలాల్‌ పవార్‌, అధికారులు..

6/8

మహిళలు తయారు చేసిన పోచంపల్లి హ్యాండ్ బ్యాగ్స్, లోయిస్ జ్యూట్ బ్యాగ్స్‌ ను చూస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..

7/8

జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగం..

8/8

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు రాధాకృష్ణుల మెమెంటోను బహూకరిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రక్కన కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి, కలెక్టర్, ఉన్నతాధికారులు..

Updated Date - Oct 25 , 2024 | 01:52 PM