Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా?
ABN , Publish Date - Dec 28 , 2024 | 02:20 PM
విటమిన్-సీ సప్లిమెంట్లతో రోగ నిరోధక శక్తి మెరుగవుతుందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. విశేష యాంటీఆక్సిడెంట్ గుణాలున్న విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థకు అనేక రూపాల్లో సహకరిస్తుంది. ఫలితంగా ఇది శరీరానికి అవసరమైన కీలక విటమిన్‌గా మారింది.
ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల ఉత్పత్తికి విటమిన్ సీ ఎంతో కీలకం. తెల్లరక్త కణాల పనితీరు కూడా ఈ విటమిన్‌తో మెరుగవుతుంది
విటమిన్ సీలో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో, ఇది ఫ్రీరాడికల్స్ కలిగించే నష్టం నుంచి రక్తకణాలను కాపాడుతుంది
చర్మంలోని రక్షణ వ్యవస్థను కూడా విటమిన్ సీ బలోపేతం చేస్తుంది. వ్యాధికారక క్రిములను అడ్డుకునే తొలి ఆయుద్ధంగా పనిచేస్తుంది.
గాయాలు త్వరగా మానేందుకు విటమిన్ సీ కీలకం. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కణజాలానికి మరమ్మతులు త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది
ఈ విటమిన్‌తో శరీరం ఐరన్‌ను మరింత సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. ఫలితంగా శరీరంలో ఆక్సీజన్ సరఫరా మెరుగై రోగ నిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుంది.
Updated Date - Dec 28 , 2024 | 02:20 PM