రోజూ ఒక నారింజ పండు తినండి.. ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి..!
ABN , Publish Date - Aug 22 , 2024 | 09:27 AM
ఆరెంజ్ లేదా నారింజ చాలామందికి ఇష్టమైన పండు. పుల్లగా, తియ్యగా కేసరి రంగులో ఉండే ఈ పండు విటమిన్-సి కి మంచి మూలం. నారింజలో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. రోజూ ఒక నారింజ పండు తింటుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆహార నిపుణులు అంటున్నారు.
రోజూ ఒక నారింజ పండు తింటుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆహార నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక శక్తి..
నారింజలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక నారింజ పండు తింటూ ఉంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.
చర్మం..
నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం యవ్వనంగా, ముడతలు లేకుండా క్లిస్టర్ క్లియర్ గా ఉంటుంది.
గుండె..
నారింజలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ..
నారింజలో పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఊబకాయం..
నారింజలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారు నారింజను రోజూ తింటే బరువు తగ్గవచ్చు.
ఎముకలు..
నారింజలో కాల్షియం, విటమిన్-డి ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి.
Updated Date - Aug 22 , 2024 | 09:27 AM