ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో జుట్టు రాలడం ఆగిపోతుంది..!

ABN, Publish Date - Aug 03 , 2024 | 02:12 PM

వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది. వర్షాల కారణంగా జీవశైలిలో కూడా మార్పులు వస్తాయి. ఇది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చర్మం, జుట్టు విషయంలో ఇది స్పష్టంగా బయటపడుతుంది. వర్షాకాలంలో జుట్టు రాలడం పెరుగుతుంది. వర్షం నీటిలో తడవడం, చుండ్రు కూడా దీనికి కారణం అవుతాయి. అయితే కొన్ని టిప్స్ తో వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

1/8

ఒమేగా-3:- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాన్ని బాగా తీసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. శాకాహారులైతే అవిసె గింజలు, చియా గింజలు, బాదం, వాల్ నట్ వంటి వాటిలో ఒమేగా-3 ఉంటుంది. మాంసాహారులైతే చేపలు తీసుకోవచ్చు.

2/8

విటమిన్-ఎ:- జుట్టు స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-ఎ చాలా కీలకం. ఇది సెబమ్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది. క్యారెట్, చిలకడ దుంపలు, బచ్చలికూర, ముదురు ఆకుకూరలలో విటమిన్-ఎ ఉంటుంది.

3/8

విటమిన్-సి:- విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. నారింజ, నిమ్మ, ద్రాక్షలలో విటమిన్-సి మెండుగా ఉంటుంది.

4/8

ఐరన్:- శరీరంలో హిమోగ్లోబిన్ కే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఐరన్ కీలకపాత్ర పోషిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ కు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. లీన్ మాంసాలు, బీన్స్, కాయ ధాన్యాలు, ఖర్జూరం, రాగులు, పాలకూర, కిస్ మిస్ మొదలైనవాటిలో ఐరన్ మెండుగా ఉంటుంది.

5/8

విటమిన్-బి:- జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ చాలా కీలకం. ఇది విటమిన్-బి లో భాగం. ప్రోటీన్, బయోటిన్ లోపం ఉంటే జుట్టు పల్చబడుతుంది. గుడ్లు, నట్స్, తృణధాన్యాలు మొదలైనవాటిలో బయోటిన్ ఉంటుంది.

6/8

జింక్:- జింక్ కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా కీలకం. జుట్టు కణజాలం పెరుగుదలకు, మరమ్మత్తుకు జింక్ సహాయపడుతుంది. గుమ్మడి గింజలు, జీడిపప్పు, శనగలు వంటి వాటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.

7/8

నీరు:- జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం హైడ్రేట్ గా ఉండాలి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ కారణంగా నీరు తక్కువ తాగుతుంటారు. కానీ నీరు బాగా తాగాలి. రోజుకు 3-4 లీటర్ల నీరు తీసుకోవాలి.

8/8

ప్రోటీన్:- జుట్టు ప్రధానంగా ప్రోటీన్ తో తయారవుతుంది. ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. చికెన్, చేపలు, బీన్స్, జున్ను, పనీర్, చిక్కుళ్లు మొదలైనవి తీసుకోవాలి.

Updated Date - Aug 03 , 2024 | 02:12 PM

Advertising
Advertising