ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలివైన వారు ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పరట.. మరి మీరు..?

ABN, Publish Date - Aug 10 , 2024 | 02:09 PM

మనుషులలో సాధారణ వ్యక్తులు, తెలివైన వ్యక్తులు, మూర్ఖులు, చెడ్డ వారు.. ఇలా చాలా రకాల వ్యక్తులు ఉంటారు. మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఇలా వర్గీకరిస్తుంటారు. అయితే తెలివైన వ్యక్తులను అందరూ ప్రత్యేకంగా చూస్తారు. చాలా మంది తాము కూడా తెలివిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే తెలివైన వ్యక్తులు 5 విషయాలను ఎవరికీ చెప్పరట. చాణక్య నీతిలో ఉన్న ఒక పద్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తెలివైనవారు ఎవరికీ చెప్పని ఆ 5 విషయాలు ఏంటంటే..

1/5

ధన నష్టం.. ధనం కొల్పోయిన వాడిని మూర్ఖుడు అంటాడు. ధనం కోల్పోవడానికి కారణాలు తగిన విధంగా ఉన్నా కూడా చేతకాని వాడు, ఏమీ తెలియని వాడు అంటూ ఎగతాళి చేస్తారు. తెలివైన వ్యక్తి ధనం కోల్పోతే దాన్ని ఇతరుల దగ్గర చెప్పడట.

2/5

దుఃఖం.. మనసు బాధపడినప్పుడు ఆ బాధను బయటకు చెప్పుకుని ఇతరుల నుండి ఓదార్పు పొందేవారు ఉంటారు. అయితే ఇలా బాధపడే వ్యక్తిని చూసి ఇతరులు ఎగతాళి చేస్తారు.

3/5

చెడు జరిగినప్పుడు.. తమకు ఏదైనా చెడు జరిగినప్పుడు దాన్ని బయటకు చెప్పడం తెలివైన వారి లక్షణం కాదట. దాన్ని అసలు బయటకు చెప్పరట. బయటకు చెబితే దాన్ని విని సంతోషించేవారే ఎక్కువ ఉంటారట. పైగా ఓదార్పు సాకుతో మనసును మరింత బాధపెడతారట.

4/5

మోసం.. ఇతరులు మోసం చేసినప్పుడు దాన్ని బయటకు చెప్పని వారు తెలివైన వారట. ఒకరి చేతిలో మోసపోయాం అనే మాట ఇతరుల ముందు చులకన భావం ఏర్పడేలా చేస్తుంది.

5/5

అవమానం.. తెలివైన వారు వ్యక్తిగతంగా అవమానం జరిగినప్పుడు దాన్ని బయటకు చెప్పరట. అవమానం గురించి బయటకు చెబితే దాన్ని అలుసుగా తీసుకుని బాధపెట్టేవారు ఉంటారట.

Updated Date - Aug 10 , 2024 | 02:11 PM

Advertising
Advertising