ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:23 PM
ఫ్యాటీ లివర్ కాలేయాన్ని దెబ్బతీసే ఆరోగ్య సమస్య. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. దీనిని ఫ్యాటీ లివర్ అని అంటారు. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఇది శరీరంలో ఇతర కార్యకలాపాలకు ఆటంకంగా మారుతుంది.
ఫ్యాటీ లివర్ సమస్య అస్సలు రావద్దని భావిస్తే.. 8 టిప్స్ ఫాలో అవ్వాలని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
బరువు..
అధిక బరువు కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కాలేయానికి ముప్పు పొంచి ఉంటుంది. బరువు తగ్గడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా చేసుకోవచ్చు.
ఆహారం..
తీసుకునే ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. అధిక కేలరీలు, వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మొదలైనవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. వీటిని తినడం మానేయాలి. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.
వ్యాయామం..
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వ్యాయామం చేస్తుంటే శరీరంలో కొవ్వు బర్న్ కావడంలో సహాయపడుతుంది.
కాఫీ..
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును బర్న్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే కాఫీని మితంగా తీసుకోవాలి.
మిల్క్ తిస్టిల్..
ఇది కుసుమ జాతికి చెందిన మొక్క. దెబ్బతిన్న కాలేయానికి చికిత్స చేయడానికి పేగు సమస్యలు నివారించడానికి ఇది సహాయపడుతుంది. వైద్యుల సలహా మేరకు దీన్ని వాడితే కాలేయ సమస్యలు తగ్గుతాయి.
చక్కెర..
శుద్ది చేసిన చక్కెర ఊబకాయానికి కారణం అవుతుంది. కాలేయం సహా మొత్తం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. చక్కెరకు బదులు బెల్లం, తేనె వంటి సహజ తీపి పదార్థాలను తీసుకోవాలి.
కాలేయ చికాకులు..
అనారోగ్యకర ఆహారాలు తీసుకోవడం, కన్ స్ట్రక్షన్ పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడం, కాలేయాన్ని దెబ్బతీసే టాక్సిన్లకు గురికావడం మొదలైనవాటికి దూరంగా ఉండాలి.
విటమిన్లు..
విటమిన్-ఎ, విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సిట్రిక్ పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే కాలేయం సేఫ్ గా ఉంటుంది.
Updated Date - Oct 02 , 2024 | 01:23 PM