ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చర్మాన్ని యవ్వనంగా ఉంచే విటమిన్-ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవే..!

ABN, Publish Date - Oct 07 , 2024 | 02:22 PM

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, శరీరానికి శక్తిని ఇవ్వడంలోనూ చాలా సహాయపడతాయి.

1/5

చర్మ ఆరోగ్యానికి విటమిన్-ఇ చాలా అవసరం. ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.

2/5

బాదం.. బాదం పప్పులలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. 28గ్రాముల బాదంపప్పు నుండి 8మి.గ్రా విటమిన్-ఇ పొందవచ్చు.

3/5

సన్ ప్లవర్ సీడ్స్.. సన్ ఫ్లవర్ సీడ్స్ లేదా పొద్దు తిరుగుడు విత్తనాలలో కూడా విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.

4/5

డ్రై ఆప్రికాట్స్.. ఎండిన ఆప్రికాట్లలో కూడా విటమిన్-ఇ కంటెంట్ అధికంగా ఉంటుంది. రోజూ నాలుగు ఎండిన ఆప్రికాట్లను రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటుంటే మంచిది.

5/5

హజెల్ నట్స్.. హజెల్ నట్స్ లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కేవలం విటమిన్-ఇ మాత్రమే కాకుండా ప్రోటీన్, కార్భ్స్, ఫైబర్ కూడా మెరుగ్గా ఉంటుంది.

Updated Date - Oct 07 , 2024 | 02:22 PM