గర్భం దాల్చడం, ప్రసవించడం ప్రతి మహిళ జీవితంలో చాలా అపురూరమైన దశలు. ఇవి మహిళలకు శారీరకంగా చాలా ఇబ్బందులు కలిగిలించినా అన్నింటిని ఎంతో ఇష్టంగా ఓర్చుకుంటారు మహిళలు. గర్భధారణ సమయంలో బరువు పెరగడం, పొట్ట పెద్దగా మారడం వల్ల పొట్ట భాగంలో చర్మం సాగుతుంది. ఇది కాస్తా స్ట్రెచ్ మార్క్స్ కు కారణం అవుతుంది. ప్రసవం తరువాత ఇది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. వీటిని తొలగించుకోవడం కోసం చాలామంది మహిళలు ఖరీదైన క్రీములు కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సహజమైన నూనెలు స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఆ నూనెలు ఏంటో తెలుసుకుంటే..