Pratyekam : గీజర్ బాంబులా పేలకూడదంటే.. ఈ 5 తప్పులు చేయకండి..
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:16 AM
గీజర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని మీకు తెలుసా? లేకపోతే స్నానానికి వెళ్లినపుడు అది బాంబులా పేలే ప్రమాదముంది. కాబట్టి, ఈ 5 విషయాలు..
స్నానం పూర్తయిన తర్వాత గీజర్ స్విచ్ ఆఫ్ చేయాలనే విషయం తరచుగా మరచిపోతుంటారు కొందరు. ఈ అలవాటు వల్ల గీజర్‌ను నిరంతరం రన్ అయ్యి విద్యుత్ బిల్లు పెరగడమే కాక నీటి నాణ్యత కూడా పాడవుతుంది. గీజర్ లోపల నీటిని ఎక్కువసేపు వేడి చేయడం వల్ల ఒత్తిడి పెరిగి పేలిపోయే అవకాశం ఉంది.
గీజర్‌ను మీరే ఇన్‌స్టాల్ చేసుకోవడం ప్రమాదకరం. ఎలా అంటే గీజర్ తాకగానే కరెంట్ షాక్ కొట్టవచ్చు. అందుకే గీజర్ నిపుణులతోనే సెట్ చేయించుకోవాలి.
విద్యుత్ ఆదా కోసం చాలా మంది గ్యాస్ గీజర్లను ఉపయోగిస్తున్నారు. ఈ గీజర్లలో బ్యూటేన్, ప్రొపేన్ వంటి వాయువులు ఉంటాయి. ఇవి మండినప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి. ఈ వాయువులు గదిలో పేరుకుపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల గ్యాస్ గీజర్ ఉన్న గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఫ్యాన్ కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపి స్నానపు గదిలో గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది.
బాత్‌రూమ్‌లో గీజర్‌ను అమర్చేటప్పుడు భద్రత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చాలామంది గీజర్‌ను పిల్లలకు అందేంత ఎత్తులోనే అమర్చుతుంటారు. దీంతో పిల్లల్లో సహజంగానే ఆసక్తి కలిగి తరచూ గీజర్ తాకడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తే కొన్ని సార్లు పిల్లలు విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశముంది. అందువల్ల, గీజర్‌ను ఎల్లప్పుడూ పిల్లలకు అందుబాటులో లేకుండా సురక్షితమైన ప్రదేశంలోనే ఏర్పాటు చేయాలి.
చౌకైన, స్థానికంగా తయారైన గీజర్‌లను కొనుగోలు చేయడం మానుకోండి. ప్రత్యేకించి ISI మార్క్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దు. ఈ గుర్తు ఆ ఉత్పత్తి నాణ్యత, భద్రత పరీక్షించారని అనేందుకు రుజువు.
ISI గుర్తు లేని గీజర్‌లు పనిచేయకపోవడానికి అవకాశం ఉంది. విద్యుత్ షాక్ లేదా మంటలకు కూడా కారణం కావచ్చు. అందువల్ల మీ భద్రత, డబ్బు రెండింటినీ ఆదా చేయడానికి ఎల్లప్పుడూ ISI గుర్తు ఉన్న గీజర్‌లనే కొనుగోలు చేయండి.
Updated Date - Dec 31 , 2024 | 11:16 AM