ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆడవారు 30ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవి..!

ABN, Publish Date - Aug 08 , 2024 | 08:34 AM

మహిళల ఆరోగ్యం ప్రతి దశలోనూ మార్పుకు లోనవుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ళ తరువాత ఆడవారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మూడ్ స్వింగ్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. 30 ఏళ్ళ తర్వాత జీవక్రియ మందగిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సులువుగా బరువు పెరుగుతారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే 30ఏళ్ళు నిండినవారు కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తినాలి.

1/5

ఆకుకూరలు:- 30 సంవత్సరాల తర్వాత బచ్చలికూర, పాలకూర, తోటకూర, మునగ ఆకు వంటివి బాగా తీసుకోవాలి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు బ్యాలెన్డ్ గా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

2/5

ఫ్యాటీ ఫిష్.. ఫ్యాటీ ఫిష్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్-డి, ప్రోటీన్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

3/5

ఉసిరి:- ఉసిరి సూపర్ ఫుడ్ లలో ఒకటి. ఇందులో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

4/5

బొప్పాయి:- 30ఏళ్ళ తరువాత మహిళలు తినాల్సిన ఆహారాలలో బొప్పాయి ముఖ్యమైనది. ఇందులో విటమిన్-ఎ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

5/5

అవకాడో:- అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్-సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. 30ఏళ్లు దాటిన మహిళలు అవకాడో తప్పనిసరిగా తినాలి.

Updated Date - Aug 08 , 2024 | 08:34 AM

Advertising
Advertising