ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇష్టపడే రంగును బట్టి మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

ABN, Publish Date - Sep 18 , 2024 | 05:02 PM

పర్సనాలిటీ టెస్ట్ అనేది చాలామంది వ్యక్తిత్వాలను నిర్ణయిస్తుంది. అంతేనా హావభావాలు, మాట్లాడే విధానం, నడక తీరు, ఇష్టాఇష్టాలు కూడా మనిషి ఎలాంటి వారో చెప్పకనే చెబుతాయట. ముఖ్యంగా ఇష్టపడే రంగును బట్టి వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయవచ్చని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. ఏ రంగును ఇష్టపడే వారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో తెలుసుకుంటే..

1/9

ఊదా రంగు.. ఊదా లేదా పర్పుల్ రంగును ఇష్టపడేవారు చాలా మంచి వ్యక్తులు. వీరు కొంత వరకు పర్ఫెక్షనిస్ట్ లు కూడా. వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరిలో పరిశీలన గుణం కూడా మెండుగా ఉంటుంది. స్వభావ పరంగా వీరు చాలా అవగాహనతో ఉంటారు.

2/9

ఆకుపచ్చ.. ఆకుపచ్చ రంగును ఇష్టపడే వ్యక్తులు ప్రకృతిని బాగా ప్రేమిస్తారు. వీరి శాంతి, ప్రశాంత వాతావరణం అంటే ఇష్టం. వ్యక్తిత్వ పరంగా శాంతంగా ఉంటారు. వీరు సంతోషంగా ఉండటానికి, తమను తాము సంతోషంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.

3/9

ఎరుపు.. ఎరుపు రంగును ఇష్టపడే వ్యక్తుల స్వభావం ధైర్యంగా, శక్తివంతంగా ఉంటుంది. వీరు చాలా నమ్మకస్తులు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఛాలెంజ్ గా స్వీకరిస్తారు.

4/9

గులాబీ.. పింక్ లేదా లేత గులాబీ రంగును ఇష్టపడే వారు ఇతరుల విషయంలో చాలా దయగా ఉంటారు. వీళ్లను గుడ్డిగా నమ్మేయచ్చట.

5/9

నీలం.. నీలం రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా ఉత్సాహమైన జీవితాన్ని గడుపుతారు. పార్టీలు, శుభకార్యాలు, సందడి సందడిగా గడపడం వీరికి ఇష్టం. అంతేకాదు వీరు ది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అవుతారు. వైవాహిక జీవితంలో వీరు మంచి భాగస్వామిగా నిలుస్తారు.

6/9

నలుపు.. నలుపు రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా మర్యాదస్తులు. అలాగే ఇతరులను మర్యాదగా మాట్లాడతారు. చాలా నిరాడంబరంగా ఉంటారు. వీరు ప్రకృతిని చాలా ఇష్టపడతారు.

7/9

తెలుపు.. తెలుపు రంగును ఇష్టపడేవారు పరిశుభ్రతకు మారుపేరు. చాలా సరళంగా ఉంటారు. విజయాలు అందుకోవడానికి చాలా నిజాయితీగా కష్టపడతారు. చాలా క్రమబద్ధమైన స్వభావం వీరి సొంతం.

8/9

పసుపు.. పసుపు రంగు ఉల్లాసానికి చిహ్నంగా నిలుస్తుంది. పసుపు రంగును ఇష్టపడేవారు జీవితంలో సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు.

9/9

బంగారు.. బంగారు రంగును ఇష్టపడే వారు భౌతిక వస్తువులను చాలా ఇష్టపడతారు. జీవితంలో చాలా విలాసాన్ని కోరుకుంటారు. ఎప్పుడూ తామే విజేతలు కావాలని అనుకుంటారు. తమకు ప్రతిష్ఠ, విలాసవంతమైన జీవితమే ముఖ్యమని వీరు భావిస్తారు.

Updated Date - Sep 18 , 2024 | 05:02 PM

Advertising
Advertising