YSRCP: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు
ABN, Publish Date - Jun 17 , 2024 | 05:39 PM
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, కీలక నేతలు, రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటన కూడా చేశారు.
ఇదీ అసలు సంగతి..!
2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసిన శిద్ధా ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి రాగానే కండువా కప్పేసుకున్నారు. ఈయన రాజీనామాపై అప్పట్లో పెద్ద రాద్ధాంతమే నడించింది. అసలు ఇలాంటి వ్యక్తికా ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని టీడీపీ పెద్దలు కూడా ఒకింత ఆవేదనకు లోనైన పరిస్థితి. వైసీపీలో చేరాక పెద్దగా ప్రాధాన్యత కూడా ఏమీ లేకపోవడం ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ కూడా రాకపోవడంతో ఇక పార్టీలో ఉన్నా ప్రయోజనమేమీ లేదని ఇలా రాజీనామా చేసినట్లుగా అనుచరులు చెప్పుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే ఐదేళ్లలో వైసీపీ ఇంటికిపోయి.. కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ టీడీపీలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. వాస్తవానికి.. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి దర్శి టికెట్ కోసం ఈయన గట్టి ప్రయత్నాలే చేసినట్టుగా ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే.. అప్పుడే వద్దన్న టీడీపీ పెద్దలు.. ఇప్పుడు అస్సలు పార్టీలోకి నో ఎంట్రీ అని తేల్చి చెప్పేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను కలిసి టీడీపీ కండువా కప్పుకోవడానికి శిద్ధా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి మొహమాటం లేకుండా చేరికను అంగీకరించలేదు.
Updated Date - Jun 17 , 2024 | 06:07 PM