AP Politics: ఉదయం లోకేష్.. ఇప్పుడు చంద్రబాబుపై ఫేక్ ప్రచారం.. చీ.. ఛీ ఇంత దిగజారుడా..?
ABN, Publish Date - Jan 25 , 2024 | 07:07 PM
YSRCP Fake Propaganda : ‘ఫేక్ ప్రచారానికి కాదేది అనర్హం’ అన్నట్లుగా అధికార వైసీపీ (YSR Congress) ప్రవర్తిస్తోంది..! సోషల్ మీడియాను (Social Media) అడ్డుపెట్టుకుని చిల్లర పనులు చేస్తోంది..! ఏం చేసినా సరే జనాల్లోకి వెళ్లిపోతుందని.. వైఎస్ జగన్ (YS Jagan) అండ్ కో ఇష్టానుసారం రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక అడ్డు అదుపూ లేకుండా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వాడేస్తోంది వైసీపీ.
‘ఫేక్ ప్రచారానికి కాదేది అనర్హం’ అన్నట్లుగా అధికార వైసీపీ (YSR Congress) ప్రవర్తిస్తోంది..! సోషల్ మీడియాను (Social Media) అడ్డుపెట్టుకుని చిల్లర పనులు చేస్తోంది..! ఏం చేసినా సరే జనాల్లోకి వెళ్లిపోతుందని.. వైఎస్ జగన్ (YS Jagan) అండ్ కో ఇష్టానుసారం రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక అడ్డు అదుపూ లేకుండా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వాడేస్తోంది వైసీపీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అమెరికా పర్యటనకు వెళ్లడంతో.. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ.. బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకుని మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని తప్పుడు ప్రచారం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం లోకేష్ పోలీసుల అదుపులో ఉన్నారని, బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని ఓ కట్టుకథను అల్లి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గురువారం ఉదయం నుంచి ఇదే పనిగాపెట్టుకుని వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు ప్రచారం చేశారు. ఇదంతా ఫేక్ అని చాచి కొట్టినట్లుగా టీడీపీ కౌంటరివ్వడంతో దీన్ని ఎలా డైవర్ట్ చేయాలా అని సాయంత్రానికళ్లా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) బ్రేకింగ్ పేరిట మరో అబద్ధాన్ని ప్రచారం చేయడం ప్రారంభించింది.
ఇంత దిగజారుడా..?
లోకేష్ అరెస్ట్ కాలేదని టీడీపీ నుంచి రియాక్షన్ రావడంతో నాలుక్కరుచుకున్న వైసీపీ.. ‘ నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా అమెరికాలోని ఏపీ ప్రజలు.. జో బైడెన్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని చంద్రబాబు పిలుపు’ అని ఏబీఎన్ బ్రేకింగ్ ప్లేట్‌తో వైరల్ చేయడం మొదలు పెట్టారు. అది కూడా ‘ఏబీఎన్ తెలుగు’ అని ట్విట్టర్ (ఎక్స్) ఖాతాతో పోస్ట్ అంటూ వైరల్ చేస్తోంది. ఇదంతా వైసీపీ పనేనని తేటతెల్లమైంది. పైగా సోషల్ మీడియాలో ఉదయం లోకేష్ గురించి.. ఇప్పుడు చంద్రబాబు గురించి ఇలా ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తల అకౌంట్లు వందల సంఖ్యలోనే ఉన్నాయ్. చూశారు కదా.. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ఎంత నీచాతి నీచానికి వైసీపీ దిగజారుతోందో..!. ఇప్పటికే ఇలా ఏబీఎన్ పేరిట ఫేక్ ప్రచారం చేస్తున్న పలువురిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చానెల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయని ఏబీఎన్ యాజమాన్యం గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారంపై నెటిజన్లు, సామాన్యులు, టీడీపీ కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. ఊరికే కాదు వైచీప్ అనేది.. ఇలాంటి పనులతోనే అని కన్నెర్రజేస్తున్నారు.
ఉదయం జరిగింది ఇదీ..!
ఇంత దిగజారిపోయారా..? ఓటమి తప్పదని తెలిసిపోయిందా..? అందుకే తప్పుడు ప్రచారానికి దిగారా..? ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ యువనేత నారా లోకేశ్ లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ మరింత దిగజారుడు రాజకీయాలకు దిగింది. ఛీ ఛీ, ఆ పాలిటిక్స్ చూస్తే ఛీదరేస్తోంది. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో నారా లోకేశ్ ఇరుక్కున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. లోకేశ్ అమెరికా పోలీసుల అదుపులో ఉన్నారని కట్టుకథను అల్లింది. బెయిల్ కోసం లోకేశ్ దరఖాస్తు చేస్తున్నారని కారు కూతలు కూసింది. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆ పుకార్లు బయటకు రాకుండా అడ్డుకట్ట వేసింది. నారా లోకేశ్‌పై ఆరోపణల గురించి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. వైసీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది.
లోకేష్‌పై వైసీపీ చేసిన ఫేక్ వార్తలు మరికొన్ని..
TDP FACT CHEK: నారా లోకేశ్‌పై వైసీపీ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన టీడీపీ
Lokesh : వై‘చీప్’ పాలిట్రిక్.. లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం.. ఇంత పైత్యం ఎందుకో..!?
Updated Date - Jan 25 , 2024 | 07:10 PM