Viral News: జస్ట్ 10 పాస్.. చిన్న ఐడియాతో కోటీశ్వరుడయ్యాడు..!
ABN, Publish Date - Aug 20 , 2024 | 10:47 PM
Viral News: వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. మన దేశంలో వ్యాపార రంగంలో అగ్రస్థానంలో వీరే ఉంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ వీరి తెలివితేటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారి వ్యాపార సామర్థ్యం, టెక్నిక్స్ అన్నీ ఇతరులను బాగా ఆకర్షిస్తాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో...
Viral News: వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. మన దేశంలో వ్యాపార రంగంలో అగ్రస్థానంలో వీరే ఉంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ వీరి తెలివితేటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారి వ్యాపార సామర్థ్యం, టెక్నిక్స్ అన్నీ ఇతరులను బాగా ఆకర్షిస్తాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో కనీస గ్రాడ్యూయేషన్ లేకుండానే.. తన తెలివితేటలతో ప్లా్న్ ప్రకారం పెట్టుబడి పెట్టి మిలియనీర్‌గా మారాడు. ఈ వ్యక్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
మాస్టర్స్ డిగ్రీ కలిగిన సునీల్.. గుజరాత్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేశాడు. కేవలం 10వ తరగతి చదివి ఇప్పుడు ఏకంగా మిలియనీర్ అయిన అతని సక్సెస్ స్టోరీని ఈ పోస్ట్‌లో వివరించాడు. సునీల్ తన పోస్ట్‌లో.. ‘‘పటేల్ అనే స్నేహితుడొకరు ఉన్నాడు. అతని వయసు 40 ఏళ్లు. అతను కేవలం 10వ తరగతి మాత్రమే చదివాడు. ఈ పటేల్ వద్ద పీటర్ థీల్ గురించి చెప్పాను. రెస్టారెంట్ తెరవడం అనేది చెత్త వ్యాపారం అని పీటర్ థీల్ చెప్పిన విషయాన్ని పటేల్‌తో చెప్పాను. రెస్టారెంట్ బిజినెస్ సక్సెస్ సాధించిన దాఖలాలు చాలా తక్కువ. నేను చెప్పింది విన్న పటేల్.. పీటర్ థీల్ ఎవరో తనకు తెలియదన్నట్లుగా ముఖచిత్రం పెట్టాడు. ఆ తరువాత రెస్టారెంట్‌ని ఓపెన్ చేయడం ద్వారా కోటీశ్వరుడు అయ్యే మార్గాన్ని పటేల్ చెప్పాడు. న్యూజెర్సీలో నివసించే అతని బంధువులైన 50 కుటుంబాలు అతని వద్దకు వస్తారు. వారు మంచి గుజరాతీ ఆహారం కోసం అతని రెస్టారెంట్‌కి వస్తారట. పటేల్ తన కస్టమర్ల గురించి ఇలా చెప్పాడు. ‘ఉప్పు తక్కువగా ఉంటే వారు నా రెస్టారెంట్‌కు రాకుండా ఆగలేరు. ఆహారంలో కొంత ఉప్పు తక్కువైంది. వెయ్యి అని చెబుతారు’ అని చెప్పాడు. ఇలా న్యూయార్క్, పెన్సిల్వేనియా నుంచి చాలా మంది గుజరాతీలు రాబిన్స్‌విల్లేలోని స్వామి నారాయణ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తుంటారు. ఆ సమయంలో టూరిస్ట్ బస్సును అద్దెకు తీసుకుంటారు. రాబిన్స్‌విల్లే మార్గంలో వారు రుచికరమైన గుజరాతీ థాలీని తినడానికి నా రెస్టారెంట్‌కి వస్తారు. ఒక బస్సుకు 50-75 మంది ఉంటారు. ఈ విధంగా రెస్టారెంట్ బాగానే నడుస్తుంది. అయితే, అతను పదేళ్లుగా ఉదయాన్నే రెస్టారెంట్ తెరవడం, దాల్ చావల్, సబ్జీ రోటీ, ధోక్లా, టీ చేసి విక్రయించేవాడు. ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు.’’ అని సునీల్ చెప్పుకొచ్చాడు.
‘దీన్నిబట్టి అర్థమయ్యేది ఏంటంటే.. బిజినెస్ సక్సెస్ కావాలంటే చదువు ఒక్కటే కాదు మంత్రం కాదు. కనీస జ్ఞానం ఉండాలి. అంతర్‌ధృష్టి, రిస్క్ తీసుకునే సామర్థ్యం అన్ని ఉంటేనే.. ఏ పని అయినా సక్సెస్ అవుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ పటేల్’ అని సునీల్ తన పోస్టులో పేర్కొన్నాడు.
For More Trending News and Telugu News..
Updated Date - Aug 20 , 2024 | 10:48 PM