ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఆపరేటర్ చేసిన చిన్న తప్పిదం.. 125 రైళ్ల ఆలస్యానికి కారణమైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:51 PM

ట్రైన్ ఆపరేటర్ అత్యసరంగా టాయిలెట్ కు వెళ్లవలసి వచ్చింది. దీంతో రైలు.. ప్లాట్ ఫామ్ పై నిలిపి.. బాత్ రూమ్ కు వెళ్లాడు. అతడు మళ్లీ ట్రైన్ క్యాబిన్ వద్దకు తిరిగి వచ్చే సరికి 4 నిమిషాలకుపైగా సమయం పట్టింది. దీంతో అదే సర్క్యూలర్ లో వచ్చే ట్రైన్లు అన్ని అగిపోయాయి.

సియోల్, డిసెంబర్ 03: కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే చిన్న పొరపాటు వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకు తాజా ఉదాహరణ దక్షిణ కొరియాలో సోమవారం చోటు చేసుకుంది. రైలు ఆపరేటర్ చేసిన అతి చిన్న పొరపాటు వల్ల దాదాపు 125 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంత చిన్న పొరపాటు వల్ల అంత పెద్ద నష్టం జరిగుతుందా? అని సౌత్ కొరియా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కోసారి చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తుందనేందుకు ఈ ఘటన అత్యుత్తమ ఉదాహరణగా స్థానికులు పేర్కొంటున్నారు.

Also Read: గుట్కా, పొగాకు తింటే.. ఈ రోగాలు గ్యారంటీ


దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సబ్ వేలో పని చేస్తున్న ఓ ట్రైన్ ఆపరేటర్ కు అత్యవసరంగా టాయిలెట్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడు సబ్ వేలో ట్రైన్ ఆపి.. రెండో అంతస్థులో ఉన్న బాత్ రూమ్ కు వెళ్లాడు. అతడి మళ్లీ ట్రైన్ క్యాబిన్ వద్దకు తిరిగి వచ్చే సరికి 4 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ రైలు ఆకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల.. అదే సర్క్యూలర్లో నడుస్తున్న దాదాపు 125 రైళ్లు ఆగిపోవాల్సి వచ్చింది. అతని చేసిన ఈ పొరపాటు కారణంగా, రాజధాని సియోల్ లో నడుస్తున్న అన్ని రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

Also Read: గంజాయి చాక్లెట్లు విక్రయం.. పల్నాడులో ఈగల్ డైరెక్టర్ పర్యటన


దీంతో రైల్లో ప్రయాణిస్తున్న వారంతా దాదాపు 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుతోన్నారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద పరిణామాలకు దారితీస్తుందని ఈ ఘటన రుజువు చేస్తుంది. అసలు ఊహించని ఈ సంఘటన.. దేశంలో పెద్ద సమస్యగా మారింది. దీనిపై సియోల్ మెట్రో స్పందించింది. ప్రయాణికులను కొద్దిపాటి ఆలస్యమైనా గమ్యస్థానానికి చేరుస్తామని హామీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.


మరోవైపు.. ఈ వార్త కథనం మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆపరేటర్లు స్టేషన్ లో దిగాలని ఎందుకు భావించారనే ప్రశ్న తలెత్తుంది. వాస్తవానికి, రైలులో ఆపరేటర్లకు అత్యవసర పరిస్థితుల కోసం పోర్టబుల్ టాయిలెట్లు ఉంటాయి. కానీ వారు మాత్రం చాలా సార్లు బాత్రూమ్‌ను వినియోగిస్తు ఉంటారు. అయితే ప్లాట్‌ఫారమ్‌పై రైలును దూరంగా ఉంచి.. ట్రైన్ ఆపరేటర్లు బాత్ రూమ్ కు వెళ్తారు. కానీ ట్రైన్ ఆపరేటర్ అనుకోకుండా ఇలా చేయడం వల్ల.. సియోల్ లో రైలులో ప్రయాణిస్తున్న ప్రజలు కొంత ఆలస్యంతో తమ తమ గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

For pratyekam News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 06:42 PM