ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Tourism: తక్కువ బడ్జెట్‌తో హాలిడే ట్రిప్.. తెలంగాణ మినీ మాల్దీవులు బెస్ట్

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:31 PM

వీకెండ్‌లో ఏదైనా ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాదీలు తక్కువ బడ్జెట్‌లో మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందడానికి ఓ చోటుంది. అదే తెలంగాణ మినీ మాల్దీవులు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తారు.

హైదరాబాద్: వీకెండ్‌లో ఏదైనా ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాదీలు తక్కువ బడ్జెట్‌లో మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందడానికి ఓ చోటుంది. అదే తెలంగాణ మినీ మాల్దీవులు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలుస్తారు. జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా సోమశిలకు ఇటీవలే అవార్డు దక్కింది. హైదరాబాద్‌కు 180 కి.మీ దూరంలో ఉన్న సోమశిల పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. నదీ జలాలు, పచ్చని అడవుల మధ్య ఈ ప్రాంతం వీకెండ్‌ ట్రిప్‌కు చాలా అనువుగా ఉంటుంది.


చేపల్ని రుచి చూడాల్సిందే..

కృష్ణా నదీ తీర ప్రాంతంలోని ఈ ప్రాంతం ఒక ద్వీపంగా మాదిరిగా కనిపిస్తుంది. సోమశిలలో గ్రామంలో కృష్ణా బ్యాక్‌వాటర్ ఉండటంతో ద్వీపం వంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి దీనిని మినీ మాల్దీవులు అని పిలుస్తారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. బోటింగ్ సదుపాయం కూడా ఉంది. కృష్ణా నదీ తీరంలో బోటింగ్‌తో పాటు ప్రత్యేకంగా చేప వంటకాలను రుచిచూడవచ్చు. చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇక్కడి నుంచి శ్రీశైలానికి బోటింగ్ ద్వారా వెళ్లవచ్చు. సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి వెళ్లేదెలా..

సోమశిల.. హైదరాబాద్‌ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్ హైవే 65పై నుంచి 3 నుంచి 4 గంటలు ప్రయాణం చేసి ఇక్కడకు చేరుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఈ గ్రామం ఉంది.


జాతీయ అవార్డులు..

కాగా ఇటీవలే సోమశిలకు ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు లభించింది. ఈ లిస్టులో నిర్మల్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 8 కేటగిరీల్లో 36 గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కళాకృతుల విభాగంలో నిర్మల్, ఆధ్యాత్మిక, ఆరోగ్య విభాగంలో సోమశిల అవార్డులు పొందాయి. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఈ అవార్డును భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖర్ అందించారు.

ఈ వార్తలు కూడా చడవండి:

MLA RajaSingh: హత్యకు రెక్కీ.. స్పందించిన రాజా సింగ్

Ponnam: ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ

Updated Date - Sep 30 , 2024 | 12:30 PM