ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lifestyle: సక్సెస్ కోసం సతమతమవుతున్నారా.. అయితే ఓ సారి ఈ చైనా కాన్సెప్ట్ ను ఫాలో అవ్వండి..

ABN, Publish Date - Jan 06 , 2024 | 04:03 PM

జీవితంలో విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకుని ఊరుకుంటే సరిపోదు. దానికి ఓ ప్రణాళికను తయారు చేసుకుని, ఆ ప్లాన్ ఆధారంగా ముందుకు వెళ్లాలి.

జీవితంలో విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకుని ఊరుకుంటే సరిపోదు. దానికి ఓ ప్రణాళికను తయారు చేసుకుని, ఆ ప్లాన్ ఆధారంగా ముందుకు వెళ్లాలి. స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకోవడం, సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజూ పని చేయడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. కానీ మనసుకు విశ్రాంతి ఇచ్చి ప్రశాంతమైన జీవితం గడపడం అందరికీ సాధ్యం కాదు. అందుకోసం చైనీయులు ఉపయోగించే వు-వీ కాన్సెప్ట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 2000 సంవత్సరాల నాటిది. వు-వీ అంటే నటించకూడదని అర్థం. మనంతట మనం ఏమీ చేయకుండా.. జరిగిపోతుందినే అనే ఆశావహ దృక్పథంతో ముందుకెళ్లాలి. ఈ భావన సమతుల్య, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

జరుగుతున్న ప్రతి విషయం చాలా సహజంగా జరిగిపోతుంటాయి. కానీ మనం మాత్రం వాటిని పెద్ద పెద్ద సమస్యలుగా భావిస్తుంటాం. అనవసరంగా ఆందోళన పడుతుంటాం. అయితే ఈ వు-వీ కాన్సెప్ట్ ను ఫాలో అయ్యేవారు ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గి ఆనందంగా ఉంటారు. ప్రతి పరిస్థితిని అదుపులో పెట్టుకోవాలని కాకుండా అన్నీ మనకే దక్కాలనే భావన నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. వ్యక్తులను, వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. కష్ట సమయాలను అధిగమించగల సామర్థ్యం మీకు ఉందని, ప్రతిదీ బాగానే ఉంటుందని నమ్మాలి. దీని ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.


జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు. ఎత్తు పల్లాలు సహజం. కష్టసుఖాలు జీవితంలో ఓ భాగం. తద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నెగటివిటీలోనూ పాజిటివిటీని చూడగలగాలి. తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. సంతోషంగా, విజయవంతంగా ఉండటానికి వు-వీ కాన్సెప్ట్ ను ఫాలో అయితే.. మన జీవితమంతా నవ్వుల పువ్వులే.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 06 , 2024 | 04:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising