ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానని బాలుడి ఏడుపు.. బలవంతంగా అమ్మ దగ్గరకు చేర్చిన పోలీసులు..

ABN, Publish Date - Aug 30 , 2024 | 08:22 PM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. 14 నెలల క్రితం తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని వదలడానికి రెండేళ్ల బాలుడు ఇష్టపడలేదు. ఆ కిడ్నాపర్‌ను వదిలి తల్లి దగ్గరకు వెళ్లడం ఆ చిన్నారి మనసుకు ఎంతో కష్టం కలిగించింది.

2-year-old boy refuses to leave kidnapper

అభం శుభం తెలియని చిన్న పిల్లల (Child) ప్రేమ నిష్కల్మషమైనది. తమకు దగ్గరైన వారు మంచి వారు, చెడ్డవారా అనేది వారికి అనవసరం. రాజస్థాన్ (Rajasthan) లోని జైపూర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. 14 నెలల క్రితం తనను కిడ్నాప్ (Kidnap) చేసిన వ్యక్తిని వదలడానికి రెండేళ్ల బాలుడు (Boy) ఇష్టపడలేదు. ఆ కిడ్నాపర్‌ను వదిలి తల్లి దగ్గరకు వెళ్లడం ఆ చిన్నారి మనసుకు ఎంతో కష్టం కలిగించింది. ఆ కిడ్నాపర్ కూడా ఆ బాలుడు వెళ్లిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


జైపూర్‌లోని సంగనేర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పృథ్వి అనే 11 నెలల పిల్లాడు 14 నెలల క్రితం కిడ్నాపయ్యాడు. బాలుడు పృథ్వి తల్లికి బంధువైన తనూజ్ చాహర్ అనే హెడ్ కానిస్టేబుల్ ఈ కిడ్నాప్ చేశాడు. బాలుడి తల్లి తనతో రావడానికి ఇష్టపడకపోవడంతో తనూజ్ ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డాడు. కిడ్నాప్ తర్వాత సస్పెన్షన్‌కు గురయ్యాడు. తనూజ్ యూపీ పోలీసు విభాగంలో స్పెషల్ ఫోర్స్, నిఘా టీమ్స్‌లో కూడా పని చేసినందు వల్ల పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక ప్లాన్‌లు వేశాడు. మొబైల్ ఫోన్ వాడలేదు. తరచూ తన స్థానాలు మార్చేవాడు. గడ్డం, తల బాగా పెంచాడు.


చివరకు సన్యాసిగా మారిపోయి బృందావన్‌లోని పరిక్రమ మార్గంలో యమునా నదికి సమీపంలోని ఖాదర్ ప్రాంతంలో ఓ గుడిసె వేసుకున్నాడు. ఎన్ని వేషాలు వేసినా తను కిడ్నాప్ చేసిన బాలుడు పృథ్విని మాత్రం కన్న కొడుకులా చూసుకున్నాడు. అతడ అలనా పాలనా చూసి గారాభంగా పెంచాడు. 14 నెలలుగా తనూజ్ కోసం గాలిస్తున్న జైపూర్ పోలీసులకు ఇటీవల అతడి ఆచూకీ దొరికింది. అతడిని వెంబడించి పట్టుకుని జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పృథ్విని తల్లికి అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే పృథ్వి తనను కిడ్నాప్ చేసిన తనూజ్‌ను వదలడానికి ఇష్టపడలేదు. కిడ్నాపర్ తనూజ్‌ను కౌగిలించుకుని ఏడ్చాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి ఇష్టపడలేదు. చివరకు ఓ పోలీసు అధికారి మరీ బలవంతంగా విడదీసి తల్లికి అప్పగించాడు. ఆ సమయంలో నిందితుడు తనూజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: నాగుపాము పకోడీ.. ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్.. ఆ షాప్‌లో పాములతో ఏం చేస్తున్నారంటే..


Viral Video: వార్నీ.. మ్యాంగో జ్యూస్ ఇలా తయారు చేస్తారా.. ఈ వీడియో చూశాక కూడా తాగారంటే మీకు హ్యాట్సాఫ్..


Viral Video: 900 ఏళ్ల నాటి గుడిలో వెకిలి వేషాలు.. టెంపుల్ రన్ గేమ్‌ను రీ-క్రియేట్ చేస్తూ పరుగులు.. చివరకు..


Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్


Optical Illusion: డైనోసర్ల మధ్య ఉన్న బల్బును కనిపెట్టండి.. మీ పరిశీలనా శక్తి ఏపాటిదో తెలుసుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2024 | 08:22 PM

Advertising
Advertising