ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tourism: బీచ్‌పై మనసు పారేసుకున్నారా.. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నవివే..

ABN, Publish Date - Sep 30 , 2024 | 01:33 PM

అసలే దసరా సెలవులకాలం. ఆపై చుట్టాలంతా ఓ చోట చేరే సమయం. ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడానికి ఇదే మంచి తరుణం. ఏదో ఒక రోజు బీచ్‌కు వెళ్లాలని మీరు అనుకునే ఉంటారు. హైదరాబాద్‌లో బీచెక్కడ అని అంటారా. అవును భాగ్యనగరంలో బీచ్ లేదు కానీ.. చేరువగా కొన్ని బీచ్‌లైతే అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్: అసలే దసరా సెలవులకాలం. ఆపై చుట్టాలంతా ఓ చోట చేరే సమయం. ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడానికి ఇదే మంచి తరుణం. ఏదో ఒక రోజు బీచ్‌కు వెళ్లాలని మీరు అనుకునే ఉంటారు. హైదరాబాద్‌లో బీచెక్కడ అని అంటారా. అవును భాగ్యనగరంలో బీచ్ లేదు కానీ.. చేరువగా కొన్ని బీచ్‌లైతే అందుబాటులో ఉన్నాయి. బీచ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏపీనే. విశాఖపట్నంలో ఉన్న రిషికొండ బీచ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. దీన్నే వైజాగ్ బీచ్ అని కూడా అంటారు. బీచ్‌లో బంగారు రంగులో ఉన్న ఇసుక, స్వచ్ఛమైన నీరు, ప్రకృతి రమణీయత మధ్య ఉన్న కొండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విండ్‌సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ లేదా స్విమ్మింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ స్పాట్.


అలాగే బీచ్‌లో పచ్చని వాతావరణం, ప్రశాంతమైన అలలను తనివితీర చూస్తూ కుటుంబంతో హ్యాప్పీగా ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్ బీచ్.. హైదరాబాద్ నుండి దాదాపు 620 కి.మీ దూరంలో ఉంది. బడ్జెట్ కాస్త ఎక్కువైనా పర్వాలేదనుకుంటే విమానంలో కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి వైజాగ్‌కు నేరుగా రైలు సదుపాయం ఉంది. విశాఖ ఎక్స్‌ప్రెస్, వందే భారత్, గోదావరి, ఈస్ట్ కోస్ట్, గరీబ్ రథ్, ఫలక్‌నమా, కోణార్క్, జన్మభూమి మాత్రమే కాకుండా ఒడిశా మీదుగా వెళ్లే రైళ్లన్ని వైజాగ్‌లో ఆగుతాయి. కాస్త రిస్క్ అయినా.. బస్సు సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు.


హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న మరికొన్ని బీచ్‌లను పరిశీలిద్దాం..

1.యారాడ బీచ్

వైజాగ్ నుంచి 15 కి.మీ.ల దూరంలో ఉన్న యారాడా బీచ్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రకృతి అందాలను పరుచుకున్న కొండలు ప్రత్యేక ఆకర్షణ. రద్దీ ఎక్కువ ఉండకపోవడంతో ఇటు వైపు పిక్నిక్‌లకు వెళ్లుంటారు. వైజాగ్ వరకు ట్రైన్‌లో వెళ్లి అక్కడి నుంచి బస్సులో యారాడ బీచ్‌కు వెళ్లొచ్చు.

2.భీమిలి బీచ్

భీమునిపట్నంను భీమిలి బీచ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సముద్ర తీరం ప్రశాంతంగా ఉంటుంది. విశాఖపట్నం నుండి 24 కి.మీ దూరంలో ఉన్న ఈ బీచ్‌లో రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రైవసీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ స్పాట్. డచ్, బ్రిటిష్ వలసవాదులకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఈ బీచ్ వద్ద కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ట్రైన్‌లో వెళ్లి అక్కడి నుంచి బస్సులో భీమిలి బీచ్‌కు చేరుకోవచ్చు.


3.సూర్యలంక బీచ్

గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. ఇది భాగ్యనగరానికి దాదాపు 350 కి.మీ దూరంలో ఉంది. కాబట్టి వారాంతంలో ఇక్కడకు వెళ్లవచ్చు. సందర్శకులు వసతి పొందేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC)కు చెందిన హరిత బీచ్ రిసార్ట్ ఇక్కడ ఉంది. హైదరాబాద్ నుంచి చెన్నై, తిరుపతి వెళ్లే రైలు ఎక్కి బాపట్లలో దిగాలి. అక్కడి నుంచి బస్సులో సూర్యలంక బీచ్‌కు చేరుకోవచ్చు.

4.మంగినపూడి బీచ్

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి సమీపంలో మంగినపూడి బీచ్ ఉంది. ఇది హైదరాబాద్‌కు 340 కి.మీ.ల దూరంలోనే ఉంది. మునిగిపోయే భయం లేకుండా ఈత కొట్టడానికి ఇక్కడ అవకాశం ఉంది. నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు ఈ బీచ్‌ను సందర్శిస్తారు. సాయంకాల వేళలో ఇసుకతిన్నెలపై అలా సేదతీరితే లోకాన్ని మర్చిపోవడమే. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నానికి నేరుగా రైలు సదుపాయం ఉంది. అక్కడి నుంచి మంగినపూడి బీచ్‌కు బస్సులో వెళ్లొచ్చు.


5.ఓడరేవు బీచ్

హైదరాబాద్ నుంచి 340 కి.మీ.ల దూరంలో ప్రకాశం జిల్లాలోని చీరాల పట్టణానికి సమీపంలో ఓడరేవు బీచ్ ఉంది. ఇది స్వచ్ఛమైన ఇసుక, నీటిని కలిగి ఉంటుంది. ఇక్కడకు వచ్చే సందర్శకులకు వినోదానికి కొదవలేదు. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చి హ్యాప్పీగా ఓడరేవు బీచ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే ట్రైన్ ఎక్కి చీరాలలో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, లేదా ప్రైవేటు వాహనాల్లో ఓడరేవు బీచ్‌కు చేరుకోవచ్చు.

DSC Results 2024: ఒక్క క్లిక్‌తో డీఎస్సీ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా

Tour Plans: లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్

Gold Prices Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్

For Latest News and National News click here

Updated Date - Sep 30 , 2024 | 01:36 PM