Shocking: ధూమపానంతో గొంతుక లోపల వెంట్రుకల పెరుగుదల!
ABN, Publish Date - Jun 27 , 2024 | 08:24 PM
ధూమపానం కారణంగా ఓ వ్యక్తి అసాధారణ సమస్య ఎదుర్కొన్నాడు. అతడి గొంతుక లోపల రోమాలు పెరగడం ప్రారంభించాయి. ఆస్ట్రియాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ధూమపానం కారణంగా ఏటా వేల మంది మరణిస్తున్నారు. ఈ అలవాటుతో క్యాన్సర్ వంటి మహమ్మారుల ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. అయితే, ధూమపానం కారణంగా ఓ వ్యక్తి అసాధారణ సమస్య ఎదుర్కొన్నాడు. అతడి గొంతుక లోపల రోమాలు పెరగడం ప్రారంభించాయి. ఆస్ట్రియాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఉదంతం వైద్యుల్లో సంచలనానికి (Viral) దారి తీసింది.
Viral: భార్యపై అనుమానం.. పోలీసు ఉన్నతాధికారి ఏం చేశాడో తెలిస్తే..
పూర్తి వివరాల్లోకి వెళితే, బాధితుడికి 1990ల నుంచే ధూమపానం అలవాటు ఉంది. అయితే, వయసు పెరిగాక అతడికి గొంతులో కొన్ని మార్పులు కనిపించాయి. వెంట్రుకలు పెరగడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అసలు ఇది ఎలా సాధ్యమైందో వైద్యులకే తొలుత అర్థం కాలేదు. గొంతు బొంగురు పోవడం, దగ్గుతో అతడు నిరంతరం సతమతమయ్యేవాడు. దగ్గినప్పుడు వెంట్రుకలు బయటకు వచ్చేవని కూడా చెప్పాడు (54 year old Austrian Man Gets Hair Growth Inside Throat Due To Smoking).
2010లో అతడికి వైద్యులు రకరకాల పరీక్షలు చేసే క్రమంలో ఓ చిన్న పాటి కెమెరాను పంపించారు. దీంతో, అతడి గొంతులో వెంట్రుకలు ఉన్న విషయం బయటపడింది. వాటిని తొలగించినా కూడా మళ్లి మొలిచాయి.
అయితే, దూమపానం కారణంగా ఈ సమస్య వచ్చి ఉండొచ్చని కొందరు డాక్టర్లు అనుమానించారు. చివరకు ఈ అలవాటును మానుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 2020లో అతడు ధూమపానాన్ని కట్టిపెట్టాడు. ఆ తరువాత డాక్టర్లు అతడి గొంతుకలోని వెంట్రుక కుదుళ్లు శస్త్రచికిత్స ద్వారా మళ్లి మొలవకుండా చేశారు. ఆ తరువాత అతడి సమస్య పూర్తిగా తొలగిపోయింది.
Updated Date - Jun 27 , 2024 | 08:24 PM