ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ వ్యక్తిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు.. బైక్‌తో సహా వరదలో చిక్కుకున్నా అతడేం చేస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Jul 08 , 2024 | 02:15 PM

రుతుపవనాల రాకతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో వరదల కారణంగా రాకపోకలు స్తంభించిపోయాయి. గుజరాత్‌లో కూడా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Man stuck in Flood

రుతుపవనాల రాకతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో వరదల (Floods) కారణంగా రాకపోకలు స్తంభించిపోయాయి. గుజరాత్‌ (Gujarat)లో కూడా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని వ్యక్తిని చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు (Viral Video).


vaishalimakvana16 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్రిడ్జి దాటుతూ బైక్‌ (Bike)తో సహా వరదలో చిక్కుకుపోయాడు. వేగంగా ప్రవహిస్తున్న నీటి మధ్యలో చిక్కుకుపోయి బయటకు ఎలా రావాలో తెలియని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి చక్కగా గుట్కా (Pan parag)కు చేతుల మధ్యలో వేసి నులుముతున్నాడు. అంతటి టెన్షన్ సమయంలో కూడా ఆ వ్యక్తి గుట్కా మీద ధ్యాస పెట్టడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒడ్డు మీద ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. 4.8 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతడు భయంతో గుట్కా నములుతున్నాడు``, ``అతను చాలా టెన్షన్‌లో ఉన్నాడు``, ``నీటలో కొట్టుకుపోతున్నా నోటిలో గుట్కా ఉండాలి``, ``గుట్కా తింటూ అతను ఆలోచిస్తున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్ల ముందే మాయమైన రోడ్డు.. వీడియో చూస్తే అవాక్కవడం ఖాయం.. యూపీలో ఏం జరిగిందంటే..


Puzzle: మీ బ్రెయిన్‌కు టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 08 , 2024 | 02:15 PM

Advertising
Advertising
<