Guinness Record: ఒకేసారి 38 శునకాలతో అరుదైన ఫీట్.. గిన్నిస్ రికార్డ్ బద్దలు
ABN, Publish Date - Oct 24 , 2024 | 05:32 PM
ఓ వ్యక్తి రెండు కాదు.. మూడు కాదు ఏకంగా 38 శునకాలను ఒకేసారి నడిపించాడు. అది కూడా 0.6 మైళ్ల దూరం (దాదాపు 1 కిలోమీటర్) తిప్పాడు. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు బద్దలైంది. ఒకేసారి అత్యధిక శునకాలను నడిపించిన తొలి వ్యక్తికి కెనడాకు చెందిన మిచెల్ రూడీని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాడు.
బెల్ట్ కావొచ్చు లేదా తాడుతో కట్టేసి ఉన్న శునకాలను ఆరుబయట నియంత్రించడం అంత తేలిక కాదు. ఒక శునకాన్ని తిప్పడానికే యజమానులు తెగ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి రెండు కాదు.. మూడు కాదు ఏకంగా 38 శునకాలను ఒకేసారి నడిపించాడు. అది కూడా 0.6 మైళ్ల దూరం (దాదాపు 1 కిలోమీటర్) తిప్పాడు. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు బద్దలైంది. ఒకేసారి అత్యధిక శునకాలను నడిపించిన తొలి వ్యక్తికి కెనడాకు చెందిన మిచెల్ రూడీని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాడు. దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి గతంలో అత్యధికంగా 36 శునకాలను నడిపించగా ఆ రికార్డును రూడీ బద్దలు కొట్టాడు.
మిచెల్ రూడీ రికార్డు సాధించడానికి అవసరమైన శునకాలను ‘ది కొరియన్ కే9 రెస్క్యూ’ అనే సంస్థ అందించింది. కాగా కెనడాలో ‘బీవోఎన్‌కే’ (BONK) ఛారిటబుల్ కార్యక్రమాన్ని తీసుకురావడంలో కృషి చేసినవారిలో మిచెల్ రూడీ ఒకడిగా ఉన్నాడు. ఇన్ని కుక్కలతో ఒకేసారి ఆడుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అతడు చెప్పాడు.
ఈ కుక్కల్లో కొన్ని పప్పీ మిల్ ఇండస్ట్రీకి చెందినవి కాగా, మరికొన్నింటిని గతంలో మాంసం కోసే ప్రాంతాలలో రెస్క్యూ చేసినవని ఆయన వివరించారు. వీటిని కేకే9ఆర్ (KK9R) సంరక్షిస్తోందని తెలిపారు. తాను నడిపిన శునకాల్లో కొన్ని కొరియాలోని ఇతర ఏజెన్సీలకు చెందినవి కూడా ఉన్నాయని వివరించారు.
శునకాల సంరక్షణ వెనుక చాలా అపోహలు ఉన్నాయని, కానీ అవి గొప్ప జంతువులని, వాటికి కాస్త ప్రేమను పంచడం అవసరమని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి మిచెల్ రూడీ తెలిపారు. తాను చేసిన ఈ ప్రయత్నంతో తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ కుక్కలను దత్తత తీసుకోవాలనే ఆలోచనను ప్రేరేపించిందని ఆయన చెప్పారు. ఈ శునకాలను ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి ఏదైనా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇవి మంచి శునకాలని, ఇళ్లలో ఉండేందుకు పూర్తి అర్హుతలు ఉన్నాయని చెప్పారు.
ఇక కాగా రెస్యూ శునకాలను సంరక్షించే కేకే9ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గినా కిమ్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కోసం శునకాలకు శిక్షణ ఇవ్వడానికి తమ వద్ద సమయం లేదని, కానీ వాటికి ముందుగానే తెలిసి ఉండడంతో తక్కువ సమయంలో చాలా సాధించగలిగామని అన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 05:32 PM