China: డేటింగ్‌కు వెళ్లండి.. బోనస్ తీసుకోండి.. ఉద్యోగులకు చైనా కంపెనీ వినూత్న ఆఫర్..
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:16 PM
గత కొన్నేళ్లుగా చైనాలో జనాభా నియంత్రణను చాలా కఠినంగా అమలు చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువత శాతం బాగా పడిపోయింది. దీంతో చైనాలో కొంత కాలంగా మానవ వనరుల సంక్షోభం నెలకొంది. దీంతో చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదలపై దృష్టి సారించింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా సంఖ్య గల దేశం చైనా (China). భారత్ కూడా చైనాకు చాలా చేరువగా వచ్చేసింది. అయితే గత కొన్నేళ్లుగా చైనాలో జనాభా నియంత్రణను చాలా కఠినంగా అమలు చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువత శాతం బాగా పడిపోయింది. దీంతో చైనాలో కొంత కాలంగా మానవ వనరుల సంక్షోభం నెలకొంది. దీంతో చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదలపై దృష్టి సారించింది. పలు పథకాలు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ టెక్ కంపెనీ వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ఉద్యోగులకు డేటింగ్ బోనస్ ప్రకటించింది (Viral News).
దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన ఇన్‌స్టా 360 అనే టెక్ కంపెనీ (Chinese tech firm) ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సంస్థకు డేటింగ్ (Dating) యాప్ కూడా ఉంది. ఈ సంస్థకు చెందిన బ్యాచిలర్ ఉద్యోగులు ఆ యాప్‌లో పోస్ట్‌లు పెట్టి బయటి వారిని ఆకర్షితులను చేయాలి. అలా చేస్తే వారు చేసే ఒక్కో పోస్ట్‌కు 66 యువాన్లు (రూ.770) ఇస్తారు. ఆ తర్వాత వారితో మూడు నెలల పాటు డేటింగ్ చేయాలి. అలా డేటింగ్ వరకు వెళితే భాగస్వాములు ఇద్దరికీ చెరో 1000 యువాన్లు (రూ.11, 700) రివార్డు ఇస్తారు. అలాగే ఇంకా పలు ఇన్సెంటివ్‌లు కూడా ఉంటాయి. ఈ కంపెనీ ప్రకటించిన ఆఫర్ చాలా మందిని ఆకట్టుకుంటోంది (Dating Rewards).
రిలేషన్ షిప్‌లో ఉన్న ఉద్యోగులు మరింత శ్రద్ధగా పని చేస్తారని సదరు సంస్థ భావిస్తోంది. కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించడంతో చాలా మంది ఇప్పటికే పోస్ట్‌లు చేయడం ప్రారంభించారట. ఇప్పటికే 1.16 లక్షలకు పైగా బహుమతులను సంస్థ ఉద్యోగులకు పంచేసిందట. కాగా, షెన్‌జెన్ ప్రకటించిన బోనస్‌ను కొందరు ఆహ్వానించగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ``నా పెళ్లి గురించి మా అమ్మ కంటే మా సంస్థే ఎక్కువ పట్టించుకుంటోంద``ని ఓ ఉద్యోగి జోక్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: మేం అంబానీల కంటే తక్కువ కాదు.. మా ఇంట పెళ్లికి రండి.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
Viral Video: చిన్న వయసులోనే చాలా విషయాలు తెలుసుకున్నాడు.. ఎగ్జామ్‌లో ఆ కుర్రాడు రాసింది చదివితే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 20 , 2024 | 12:16 PM