ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక ప్రాంగణం... 18వేల మంది నివాసం

ABN, Publish Date - Sep 15 , 2024 | 09:39 AM

ఇంతకు ముందు అపార్ట్‌మెంట్‌ అంటే పది పన్నెండు ఫ్లాట్స్‌తో ఉండేవి. నగరాలు పెరుగుతున్న కొద్ది అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం, ఎత్తు పెరిగాయి. 100 నుంచి 500 కుటుంబాల దాకా నివాసం ఉండే భారీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. అయితే రష్యాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మాత్రం ఏకంగా 18 వేల మంది నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు.

ఇంతకు ముందు అపార్ట్‌మెంట్‌ అంటే పది పన్నెండు ఫ్లాట్స్‌తో ఉండేవి. నగరాలు పెరుగుతున్న కొద్ది అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం, ఎత్తు పెరిగాయి. 100 నుంచి 500 కుటుంబాల దాకా నివాసం ఉండే భారీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. అయితే రష్యాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మాత్రం ఏకంగా 18 వేల మంది నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. అది ఒక పట్టణ జనాభాతో సమానం. కావునే ప్రపంచంలోనే అతి పెద్ద నివాస భవనంగా గుర్తింపు పొందింది. దానిలో ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అందుకే పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది.


3708 ఫ్లాట్లు... 35 ప్రవేశ ద్వారాలు...

రష్యాలో ఉన్న లెనిన్‌గ్రాడ్‌ ప్రాంతంలోని కుడ్రోవో అనే పట్టణంలో... ఓవల్‌ ఆకారంలో 25 అంతస్తుల్లో ఒక అపార్ట్‌మెంట్‌ నిర్మించారు. అందులో పదులు కాదు... వందలు కాదు... ఏకంగా 3708 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ను చుట్టి రావాలంటే ఒక్కరోజు సరిపోదు. ఒక పట్టణాన్ని తలపించేలా ఉండే భారీ ప్రాంగణమిది. ఇందులోకి రాకపోకల కోసం 35 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఫ్లాట్ల యజమానులు వారికి ఏ ప్రవేశ ద్వారం దగ్గరగా ఉంటే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి 2015లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ మధ్య ఒక నెటిజన్‌ సోషల్‌ మీడియాలో ఈ అపార్ట్‌మెంట్‌ ఫొటోలు పెట్టిన ఒక్క రోజులోనే తెగ వైరల్‌ అయ్యాయు. అప్పుడే దీని గురించి ప్రపంచానికి తెలిసింది.


అన్నీ అందులోనే...

ఈ బాహుబలి అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కమ్యూనిస్టు ఆర్కిటెక్చర్‌ స్టయిల్‌లో దీనిని నిర్మించారు. అన్ని ఫ్లాట్లకు సరైన వెలుతురు వచ్చేలా ప్లానింగ్‌ చేశారు. ప్రతీ సెక్షన్‌ దగ్గర నాలుగు స్పీడ్‌ ఎలివేటర్లను ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సులో ఆన్‌లైన్‌ పార్సిళ్లు డెలివరీ చేయాలంటే కష్టంతో కూడుకున్న పనే. ఎక్కడికి వెళ్లాలి? ఏ ప్రవేశద్వారం నుంచి వెళితే త్వరగా చేరుకుంటామో అవగాహన లేకపోతే డెలివరీ బాయ్స్‌ గంటల కొద్ది లోపలే తిరగాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.


అలాగే ఈ నివాస సముదాయంలో సకల సౌకర్యాలున్నాయి. ఏడు గ్రాసరీ స్టోర్లు, మూడు బ్యూటీ సెలూన్లు, ఫ్లోరిస్టు, హార్డ్‌వేర్‌ స్టోర్‌, మూడు కెఫేలు, పోస్టాఫీసు, ఫార్మసీ, అవుట్‌ పేషెంట్‌ హాస్పిటల్‌, పెట్‌ స్టోర్‌, చిల్డ్రన్‌ స్పోర్ట్‌ సెంటర్‌, స్టేషనరీ స్టోర్‌, కంప్యూటర్‌ గేమ్‌ క్లబ్‌... వంటివి అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ భవనం పక్కనే స్కూల్‌, కిండర్‌గార్డెన్‌తో పాటు సూపర్‌మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. మెట్రోస్టేషన్‌, బస్‌స్టేషన్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలోనే ఉన్నాయి. ఇక కార్ల పార్కింగ్‌ విషయంలోనూ ఇబ్బంది లేదు. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సు మధ్యలో విశాలమైన స్థలం ఉంటుంది. అందులో వాహనాల పార్కింగ్‌ చేస్తుంటారు.


ఆన్‌లైన్‌ గ్రూపుల్లో...

ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించే వారు ఫంక్షన్లకు పిలుచుకోవడం చూస్తుంటాం కదా! ఈ అపార్ట్ట్‌మెంట్‌లో నివసించేవారు కొన్ని ఆన్‌లైన్‌ గ్రూపులు క్రియేట్‌ చేసుకున్నారు. ఏ సమాచారమైనా ఆ గ్రూపుల్లో షేర్‌ చేసుకుంటుంటారు. సోషల్‌ మీడియాలో ఈ భారీ అపార్ట్‌మెంట్‌ గురించి వైరల్‌ కావడంతో దీన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది. చాలామంది రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఒక రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ పర్యాటక ప్రదేశంగా మారడం వింతే కదా.

Updated Date - Sep 15 , 2024 | 09:39 AM

Advertising
Advertising