Viral News: అర్ధరాత్రి ఆస్పత్రిలో నగ్నంగా తిరుగుతున్న డాక్టర్.. ఎందుకంటే?
ABN, Publish Date - Mar 10 , 2024 | 12:26 PM
ఓ డాక్టర్(doctor) ప్రభుత్వాసుపత్రిలో బట్టలు లేకుండా తిరుగుతూ కెమెరాకు చిక్కాడు. అదే సమయంలో ఇతర రోగులు గమనించి సిగ్గుతో కళ్లు మూసుకున్నారు. అయినప్పటికీ ఆ రోగులను పట్టించుకోకుండా వైద్యుడు నడుస్తూ వెళ్లాడు.
ఓ డాక్టర్(doctor) ప్రభుత్వాసుపత్రిలో బట్టలు లేకుండా తిరుగుతూ కెమెరాకు చిక్కాడు. అదే సమయంలో ఇతర రోగులు గమనించి సిగ్గుతో కళ్లు మూసుకున్నారు. అయినప్పటికీ ఆ రోగులను పట్టించుకోకుండా వైద్యుడు తిరుగుతూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే రౌండ్స్‌లో ఉన్న నర్సులు బట్టలు లేకుండా డాక్టర్ వార్డులో తిరుగుతున్నట్లు గమనించారు. ఆ వైద్యుడి తీరు గురించి నర్సులు అధికారికంగా వారి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర(Maharashtra)లోని ఛత్రపతి శంభాజీనగర్(Sambhajinagar) జిల్లాలో బిడ్కిన్ గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటివల చోటుచేసుకుంది.
అయితే ఆ 45 ఏళ్ల వైద్యుడు ఎక్కువగా మద్యం(alcohol) సేవిస్తాడని స్థానికులు అంటున్నారు. దీంతోపాటు అతను మాదకద్రవ్యాలకు బానిసగా మారి మత్తులో ఉన్న క్రమంలోనే అలా దుస్తులు లేకుండా ఆస్పత్రి చుట్టూ తిరిగాడని చెబుతున్నారు. ఆ వైద్యుడి చేష్టలు అక్కడి సీసీటీవీ(CCTV) ఫుటేజీలో రికార్డయ్యాయి. డాక్టర్ దుస్తులు లేకుండా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
అతను వాష్‌రూమ్‌లోకి వెళ్లే ముందు కారిడార్‌లో గుడ్డ ముక్కను ఊపుతూ కనిపించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సివిల్ సర్జన్, శంభాజీనగర్ జిల్లా(Sambhajinagar) ఆరోగ్య సేవల విభాగాధిపతి డాక్టర్ దయానంద్ మోతిపావ్లే స్పందించారు. ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేస్తే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Chennai: అత్తాకోడళ్లు ఒకరికొకరు తినిపించుకుంటే భోజనం ఫ్రీ..
Updated Date - Mar 10 , 2024 | 12:26 PM