ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ ఆటోవాలా తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆటోలో ఎలాంటి కుర్చీ పెట్టుకున్నాడో చూడండి..

ABN, Publish Date - Sep 24 , 2024 | 12:45 PM

బెంగళూరు హైటెక్ నగరం. దేశానికే టెక్ హబ్‌గా పేరెన్నికగన్న బెంగళూరులో రకరకాల టెక్నాలజీ ఆవిష్కరణలు జరుగుతుంటాయి. టెక్ నిపుణులే కాదు.. సామాన్యులు కూడా అంతే హైటెక్‌గా ఆలోచిస్తారంటూ ఇప్పటికే ఎన్నో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Auto

బెంగళూరు (Bengaluru) హైటెక్ నగరం. దేశానికే టెక్ హబ్‌గా పేరెన్నికగన్న బెంగళూరులో రకరకాల టెక్నాలజీ ఆవిష్కరణలు జరుగుతుంటాయి. టెక్ నిపుణులే కాదు.. సామాన్యులు కూడా అంతే హైటెక్‌గా ఆలోచిస్తారంటూ ఇప్పటికే ఎన్నో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) కూడా తన తెలివితేటలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు ఆ ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral News).


Shivani Matlapudi అనే ట్విటర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో రెగ్యులర్ డ్రైవింగ్ సీటును కాకుండా, అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఆఫీస్ చైర్‌ (Office Chair)ను ఫిక్స్ చేసుకున్నాడు. చక్కగా అందులో కంఫర్టబుల్‌గా కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ ఆటో ఎక్కిన శివాని అనే నెటిజన్ అతడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``ఎక్స్‌ట్రా కంఫర్ట్ కోసం ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఆఫీస్ ఛైర్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. అందుకే నేను బెంగళూరును ఎక్కువ ప్రేమిస్తా`` అంటూ ఆమె కామెంట్ చేశారు.


ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ ఫొటోను 47 వేల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు వేల మంది ఈ ఫొటోను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఆ ఆటో డ్రైవర్ తన వెన్నెముకను పట్టించుకుంటున్నందుకు ధన్యవాదాలు``, ``ఇది మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కిందకు రాదు కదా``, ``ఇది చాలా తెలివైన పని``, ``బెంగళూరు వాసులు చాలా అడ్వాన్స్‌డ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఐఫోన్ మేనియా ఆ రేంజ్‌లో ఉంది మరి.. ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 15 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..


Viral Video: ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము.. ఏసీ కోచ్‌లో ప్రత్యక్షమైన నాగరాజు.. ప్రయాణికుల కేకలు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 24 , 2024 | 12:45 PM