ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బాబోయ్.. 100కిపై మొసళ్లను చంపేసిన రైతు.. ఎందుకంటే..

ABN, Publish Date - Sep 29 , 2024 | 07:28 PM

ఉత్తర థాయ్‌లాండ్‌లో ఒక రైతు ఏకంగా 100కిపైగా మొసళ్లను చంపేశాడు. వర్షాల కారణంగా భారీ వరదలు రావడంతో మొసళ్లు తన పొలాల నుంచి తప్పించుకొని బయటకు వెళ్లి మనుషులకు ప్రాణ హాని కలిగిస్తాయనే భయంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని లాంఫున్‌కు చెందిన నత్తపాక్ ఖుమ్కాడ్ అనే రైతు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Crocodile

ఉత్తర థాయ్‌లాండ్‌లో ఒక రైతు ఏకంగా 100కిపైగా మొసళ్లను చంపేశాడు. వర్షాల కారణంగా భారీ వరదలు రావడంతో మొసళ్లు తన పొలాల నుంచి తప్పించుకొని బయటకు వెళ్లి మనుషులకు ప్రాణ హాని కలిగిస్తాయనే భయంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని లాంఫున్‌కు చెందిన నత్తపాక్ ఖుమ్కాడ్ అనే రైతు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతడు ఒక మొసళ్ల ఫారమ్‌ను నిర్వహిస్తున్నాడు. ఫారమ్ ఉన్న ప్రాంతంలో రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా వర్షం పడడం, ఎన్‌క్లోజర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. థాయ్‌లాండ్‌తో పాటు కొన్ని దేశాల్లో కనిపించే సయామీ జాతి మొసళ్లను ఖుమ్కాడ్ చంపేశాడు.


దాదాపు మూడు మీటర్ల పొడవున్న 125 మొసళ్లను ఖుమ్కాడ్ చంపేశాడు. వరదలు ఇంకా ఎక్కువైతే మొసళ్లు గ్రామీణ ప్రాంతాలలో సంచరిస్తాయని, స్థానికులు, జంతువులపై దాడి చేసే అవకాశం ఉందని అతడు చెప్పాడు. కాగా లాంఫున్ ప్రావిన్స్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవన వర్షాల ప్రభావంతో సెప్టెంబరులో ఉత్తర థాయ్‌లాండ్ అతలాకుతలమైంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 20 మందికి పైగా చనిపోయారు.


‘‘ అన్ని మొసళ్లను చంపడానికి నేను నా జీవితంలో అత్యంత కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మొసళ్లు తప్పించుకొని బయటకు వెళ్తే ప్రజల ప్రాణాలకు జరిగే నష్టం మన అంచనాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మొసళ్లను చంపే విషయంపై నేను, మా కుటుంబ సభ్యులం కలిసి చర్చించుకున్నాం. ఇది ప్రజల జీవితాలు, ప్రజల భద్రతకు సంబంధించినది. అందుకే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాం’’ అని రైతు వివరించాడు. కాగా మొసళ్లను చంపడానికి కారణాలను ఖుమ్కాడ్ ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించాడు. వరదల కారణంగా కోతకు గురైన చెరువు గట్లను అతడు చూపించాడు. ఈ పరిస్థితి కారణంగానే తాను అత్యవసరం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఎడతెరపి లేకుండా భారీ వర్షం పడడంతో నీటి అడుగున గోడ కూలిపోయిందని వివరించాడు. చెరువు పనులను సరిచేయాలని తమ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఎడతెరిపి లేని వర్షం ఆటంకం కలిగించిందని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Sep 29 , 2024 | 07:29 PM